పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటో?

బాలీవుడ్ లో విషాదాల మీది విషాదాలు. ఒకటి మరిచిపోకముందే మరొకటి అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి దిగ్గజ నటులు క్యాన్సర్ మహమ్మారికి [more]

Update: 2020-08-13 05:30 GMT

బాలీవుడ్ లో విషాదాల మీది విషాదాలు. ఒకటి మరిచిపోకముందే మరొకటి అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి దిగ్గజ నటులు క్యాన్సర్ మహమ్మారికి   బలైపోయారు. ఆ లోపు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తో బాలీవుడ్ షాకయ్యింది. తర్వాత అమితాబ్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడి కోలుకుంది. తాజాగా సంజయ్ దత్ కి లంగ్ క్యాన్సర్ స్టేజ్ త్రీ లో ఉన్నాడు. అంటే పరిస్థితి కాస్త విషమంగానే చెప్పాలి. మరి సంజయ్ దత్ తాను కొద్దిగా కోలుకునేవరకు సినిమా షూటింగ్స్ కి బ్రేకివ్వడంతో సంజయ్ దత్ నటిస్తున్న సినిమా దర్శకనిర్మాతలకు గుండెల్లో రాయి పడింది. అందరిలో కన్నా ఎక్కువగా కెజిఎఫ్ 2 దర్శకుడు ప్రశాంత్ నీల్ కి టెంక్షన్ పట్టుకుంది. కారణం కెజిఎఫ్ 2 లో సంజయ్ దత్ అధీరా గా పవర్ ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నాడు.

సంజయ్ దత్ నటిస్తున్న సినిమాల నిర్మాతలు ఇప్పుడు నెత్తి మీద గుడ్డే అనేలా ఉంది వ్యవహారం. ఎందుకంటే సంజయ్ దత్ జైలు కి వెళ్ళినప్పుడు గతంలో అలాగే చాలామంది సినిమా నిర్మాతలకు భారీ నష్టం కలిగింది. ఇప్పుడు సంజయ్ దత్ కి క్యాన్సర్ అని బాధపడాలో.. లేదంటే ఆయన వలన సినిమాలకు భారీ నష్టం అని బాధపడాలో తెలియదు. మరి పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ 2 కి సంజయ్ క్యాన్సర్ వలన చాలా నష్టం కలిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే సంజయ్ దత్ అధీర పాత్ర షూట్ ఇంకాస్త మిగిలే ఉంది. అసలే కరోనా అందులోను సంజయ్ ఆరోగ్యం విషయంగా ఉన్న టైం లో కెజిఎఫ్ పరిస్థితి అగమ్యగోచరమే.

Tags:    

Similar News