బుక్సింగ్స్ లో కేజీఎఫ్ 2 ను బీట్ చేసిన సర్కారువారి పాట

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందిన సర్కారువారి పాట తొలిరోజు రూ.50 కోట్లు వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.

Update: 2022-05-12 04:20 GMT

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన సినిమా సర్కారువారిపాట. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తవ్వగా.. ఉదయం 7 గంటలకే మార్నింగ్ షో వేశాయి థియేటర్లు. ఈ సినిమా నుంచి తమన్ సంగీతంలో వచ్చిన పాటలు, ఇటీవల విడుదల ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత.. సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందిన సర్కారువారి పాట తొలిరోజు రూ.50 కోట్లు వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా రూ.10 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల మాదిరి.. సర్కారువారి పాటకు కూడా వారంరోజులపాటు సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులివ్వడం ప్లస్ పాయింట్ అయింది. ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.10.89 కోట్లు వసూలు చేసి టాప్ ప్లేస్ లో నిలవగా.. కేజీఎఫ్ 2 రూ.6.57 కోట్లు రాబట్టి రెండవ స్థానంలో ఉంది. సర్కారువారి పాట అడ్వాన్స్ బుకింగ్స్ లో కేజీఎఫ్ 2 ను బీట్ చేసేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.7.2 కోట్ల వసూలు చేసి, కేజీఎఫ్ 2 స్థానాన్ని సర్కారువారిపాట కొట్టేసింది. భీమ్లా నాయక్ రూ.6.30 కోట్లు, రాధేశ్యామ్ రూ.6.21 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ బిజినెస్ చేశాయి.




Tags:    

Similar News