Kalki: రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 'కల్కి'.. చరిత్ర సృష్టించిన ప్రభాస్‌

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెబెల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా ప్రభాస్‌ హీరోగా నటించిన..

Update: 2024-07-13 14:12 GMT

Kalki Movie

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెబెల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా ప్రభాస్‌ హీరోగా నటించిన సినిమా 'కల్కి' ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల కాసుల వర్షం కురిపించింది. బాహుబలి సినిమా తర్వాత మరోసారి వెయ్యి కోట్ల సినిమా చేసిన ఇండియన్ స్టార్‌గా ప్రభాస్ రికార్డ్ సృష్టించారు. జూన్ 27న విడుదలైన కల్కి మూవీ కేవలం 14 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1002 కోట్లు రాబట్టింది. దీంతో వెయ్యి కోట్లు సాధించిన 7వ సినిమాగా ప్రభాస్ కెరీర్‌లో రెండవ సినిమాగా కల్కి నిలిచింది.

ఓవర్సీస్ లో 17 మిలియన్ డాలర్స్ పైగా వసూళ్లు అందుకున్న కల్కి సినిమా బాలీవుడ్ లోనూ కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ ఏపీ, తెలంగాణలోనూ భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. అయితే ఈ కల్కి సినిమా సాధించిన సక్సెస్‌ ప్రభాస్‌పై రాబోయే సినిమాలపై మరింత హైప్‌ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్‌ మారుతి డైరెక్షన్‌లో రాజా సాబ్, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్, హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నారు.

Tags:    

Similar News