‘కబీర్ సింగ్’ సల్మాన్ చిత్రం ను బ్రేక్ చేసింది

తెలుగు సూపర్ హిట్ చిత్రం అర్జున్ రెడ్డి హిందీలో ‘కబీర్ సింగ్’ పేరట రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తొలి వీకెండ్ లోనే ఈసినిమా 70 [more]

Update: 2019-07-05 04:46 GMT

తెలుగు సూపర్ హిట్ చిత్రం అర్జున్ రెడ్డి హిందీలో ‘కబీర్ సింగ్’ పేరట రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తొలి వీకెండ్ లోనే ఈసినిమా 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి…రిలీజ్ అయినా ఐదో రోజుకే రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. ఇంకా 13 వ రోజుకి ఈమూవీ రూ.200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి అందరిని ఆశర్యపరిచింది. ఫుల్ రన్ లో 200 కోట్లు వస్తుంది అనుకుంటే 13 వ రోజుకే ఈ మార్క్ ను అందుకుంది.

దాంతో ఈచిత్రం ఆల్ టైం బ్లాక్‌బస్టర్‌గా పేర్కొంది. తొలి ఐదు రోజుల్లో రూ.100 కోట్ల మార్కును అందుకున్న ‘కబీర్ సింగ్’.. 150 కోట్ల మార్కును తొమ్మిదో రోజు టచ్ చేసింది. 10 వ రోజు రూ.175 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ఈ చిత్రం 13వ రోజుకు రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది.

అంతకముందు వచ్చిన ‘యురి’ సల్మాన్ ‘భారత్’ చిత్రాలను దాటుకుని ఈ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. ‘యురి’ 28వ రోజు ఈ మార్కును అందుకుంటే.. ‘భారత్’ 14వ రోజు దాన్ని అందుకుంది. ఈమూవీ 13 వ రోజికె అందుకోవడం విశేషం. ఓవర్సీస్ లో సైతం ఈసినిమా దుమ్ములేపుతుంది.

Tags:    

Similar News