శాకుంతలం ట్రైలర్.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించదు
ఇక చారిత్రక .. పౌరాణిక చిత్రాల రూపకల్పన విషయంలో ఆయనకి చాలా అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే
చారిత్రక సినిమాలకు గుణశేఖర్ సినిమాలు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే.. అది ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ ఉంటుంది ఆడియన్స్ లో. ఇక చారిత్రక .. పౌరాణిక చిత్రాల రూపకల్పన విషయంలో ఆయనకి చాలా అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే తాజాగా తెరకెక్కించిన దృశ్యకావ్యం.. శాకుంతలం. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో.. దేవ్ మోహన్ దుష్యంతుడిగా.. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి కీలక పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా.. ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్లో.. అద్భుతమైన విజువల్స్ ను చూపించారు మేకర్స్. ఒక వైపు అడవిలో శకుంతల ఆశ్రమవాసం.. మరో వైపు రాజ్యంలో దుష్యంతుడి రాజరికం. ఇద్దరి పరిచయం..ప్రేమ..వివాహం .. విరహం..దుర్వాసుడి శాపం..భరతుడి జననం వరకూ ఈ ట్రైలర్ లో చూపించేశారు. అద్భుతమైన విజువల్స్ తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మధ్యమధ్యలో సమంత చెప్పే డైలాగులు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ సినిమాను ఐదు భాషలలో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు.