ఆ విషయంలో ఓల్డ్ ట్రెండ్ ని ఫాలో అవుతుందట!!

టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించినా సక్సెస్ కాలేక బాలీవుడ్ కి చెక్కేసి.. అక్కడ బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్ [more]

Update: 2020-05-17 06:33 GMT

టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించినా సక్సెస్ కాలేక బాలీవుడ్ కి చెక్కేసి.. అక్కడ బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అక్కడ స్టార్ హీరోల కు అందని ద్రాక్షలా తయారైంది కియారా. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కియారా అద్వానీ.. కరోనా లాక్ డౌన్ టైం లో జిమ్ చెయ్యండి, యోగ చెయ్యండి… ఎక్కువగా తినకండి లావైపోతారంటూ.. కరోనా కబుర్లు చెబుతుంది. 
ఇక గ్లామర్ షో చేస్తూ హాట్ హాట్ గా కనబడే కియారా అద్వానీ కి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, బాలీవుడ్ హీరో తో కియారా అద్వానీ చక్కర్లు కొడుతుంది అనే టాక్ నడిచింది. కానీ కియారా మాత్రం అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. ఇక తనకి డేటింగ్ యాప్స్ అంటే ఇష్టం ఉండదని… వ్యక్తులతో పరిచయం… రొమాన్స్ విషయంలో డేటింగ్ యాప్స్ కంటే వ్యక్తిగత‌ రిలేషన్‌కే తాను ప్రయారిటీ ఇస్తానని కియారా తేల్చేసింది. ఈ విషయంలో తాను కొంత ఓల్డ్ ట్రెండ్‌ను ఫాలో అవుతానని చెప్పింది. మరి కియారా చెప్పింది కూడా నిజమే కదా..!

Tags:    

Similar News