నాగ్ – అమీర్ అంటే పడిచచ్చిపోతుందట!!
సినిమా వారసురాళ్లు సినిమా హీరోలని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమి కాదు.. వింతేమీ కాదు.. కానీ సినిమా హీరోలు తమ కూతుళ్లకు ఏ బిజినెస్ మ్యాన్ లో [more]
సినిమా వారసురాళ్లు సినిమా హీరోలని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమి కాదు.. వింతేమీ కాదు.. కానీ సినిమా హీరోలు తమ కూతుళ్లకు ఏ బిజినెస్ మ్యాన్ లో [more]
సినిమా వారసురాళ్లు సినిమా హీరోలని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమి కాదు.. వింతేమీ కాదు.. కానీ సినిమా హీరోలు తమ కూతుళ్లకు ఏ బిజినెస్ మ్యాన్ లో లేదంటే.. బాగా సెటిల్ అయిన వాడినో చూసి పెళ్లి చేస్తుంటారు. తాజాగా మంచు వారమ్మాయి ఓ హీరోని బాగా ఇష్టపడిందట. ఆ హీరో పెళ్లి చేసుకున్నప్పుడు తెగ ఫీలయ్యిందట. తెగ ఏడ్చేసిందట. సినిమాల్లో నటించడం, టాక్ షోస్ చేస్తూ అలరించడం మంచులక్ష్మీ స్టయిల్.. విలన్ గాను రాణించిన మంచు లక్ష్మికి ఇష్టమైనహీరో ఎవరో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. అతనెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంట.
అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టమట లక్ష్మికి. అమీర్ ఖాన్ కి పెళ్లయిందని తెలిసి చాలా బాధపడింది. ఆఖరికి అమీర్ ఖాన్ రెండో పెళ్లి అయినపుడు మంచు లక్ష్మి ఏడ్చేసిందట . అమీర్ ఖాన్ అంటే ఎందుకిష్టమో చెప్పింది. అమీర్ ఖాన్ సినిమాలు ఎంచుకునే విధానం తనకి బాగా నచ్చుతుంది అని చెప్పిన మంచు లక్ష్మి కి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అన్నా అంటే ఇష్టమట. అమీర్ ఖాన్, నాగార్జున పేరు వింటేనే తనకి ఏదోలా అయ్యిపోతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది లక్ష్మి.