Big boss telugu 5 : అంతా డ్రామాయేనా? ఎందుకు సీక్రెట్ రూమ్ కి?

బిగ్ బాస్ సీజన్ 5 ను మరింత రంజింప చేసేందుకు షో నిర్వాహకులు అనేక డ్రామాలకు తెరలేపుతున్నట్లు కనపడుతుంది. జస్వంత్ వెర్టిగో తో బాధపడుతున్నా అతనిని సీక్రెట్ [more]

Update: 2021-11-12 05:52 GMT

బిగ్ బాస్ సీజన్ 5 ను మరింత రంజింప చేసేందుకు షో నిర్వాహకులు అనేక డ్రామాలకు తెరలేపుతున్నట్లు కనపడుతుంది. జస్వంత్ వెర్టిగో తో బాధపడుతున్నా అతనిని సీక్రెట్ రూమ్ లోకి పంపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా అతనికి వ్యాధి ముదరుతుంటే బయటకు పంపాలి కదా? అలా చేయకుండా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి సీక్రెట్ రూమ్ లోకి పంపడాన్ని ప్రేక్షకులు సయితం ఒప్పుకోవడం లేదు.

పెద్ద కంటెస్టెంట్ ఏమీ కాకున్నా….?

జెస్సీ పెద్ద ఆటగాడు కాదు. మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే జెస్సీ కంటెంట్ కూడా ఈ షో లో చాలా తక్కువగానే కన్పిస్తుంది. నామినేషన్లలో రవి, కాజల్, మానస్, సన్నీ, సిరి ఉన్నారు. వీరి ఐదుగురితో పోలిస్తే జెస్సీ చాలా లో ఆటగాడు. అతనికి షణ్ముఖ్ ఫ్యాన్స్ మద్దతిస్తుండటంతో ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. కానీ జెస్సీకి ఆరోగ్యం బాగాలేదని సీక్రెట్ రూమ్ లోకి పంపడమెందుకు? అతని ఆరోగ్యం దృష్ట్యా షో నుంచి బయటకు పంపితే మునిగి పోయేదేముంది? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. షో రన్ చేయడానికి నిర్వాహకులు తంటాలు పడుతున్నట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News