అందుకే శ్రద్ధా పెళ్లి చేసుకోవట్లేదా..?

గత కొన్ని రోజులుగా అన్ని మీడియాల్లో నటి శ్రద్ధా కపూర్ పెళ్లి గురించే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠను పెళ్లాడబోతోందన్నదనే [more]

Update: 2019-03-23 08:39 GMT

గత కొన్ని రోజులుగా అన్ని మీడియాల్లో నటి శ్రద్ధా కపూర్ పెళ్లి గురించే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠను పెళ్లాడబోతోందన్నదనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో దీపిక పదుకొనే, సోనమ్, ప్రియాంక చోప్రాల పెళ్లి తర్వాత మళ్లీ భారీ ఈవెంట్ ఇదే కాబోతోందని ప్రచారమవుతోంది. అయితే ఈమె ఇప్పట్లో పెళ్లి చేసుకోదు అని సదరు కథనం వెల్లడించింది. బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రద్ధా కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.

బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్

తన బాయ్ ఫ్రెండ్ కం ఫోటోగ్రాఫర్ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ఇటువంటి బిజీ టైంలో పెళ్లి అంటే కష్టమని, అందుకే ఆ ఇద్దరూ తమ లవ్ కి బ్రేకప్ చెప్పేశారని సదరు కథనం వెల్లడించింది. ప్రస్తుతం శ్రద్ధా తెలుగు సాహోతో పాటు బాలీవుడ్ లో ఏబీసీడీ 3 చిత్రంలో నటిస్తోంది. మరికొన్ని సినిమాలలో నటిస్తున్న శ్రద్ధా కపూర్ ఫుల్ బిజీ కావడంతో తన బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠకు బ్రేకప్ చెప్పేసిందని ప్రచారమవుతోంది. అసలు ఇది నిజమో కాదో తెలియాలంటే శ్రద్ధా నోరు విప్పాల్సిందే.

Tags:    

Similar News