నా భర్తకి కరోనా లక్షణాలున్నాయ్ అంటున్న హీరోయిన్?

ప్రస్తుతం దగ్గొచ్చిన… జ్వరమొచ్చింది, తుమ్మినా కరోనా అని భయపడల్సి వస్తుంది. అందులోను విదేశాలకు వెళ్లొచ్చిన వారు, విదేశాల్లో ఉంటున్న వారికీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా అని [more]

Update: 2020-04-15 05:47 GMT

ప్రస్తుతం దగ్గొచ్చిన… జ్వరమొచ్చింది, తుమ్మినా కరోనా అని భయపడల్సి వస్తుంది. అందులోను విదేశాలకు వెళ్లొచ్చిన వారు, విదేశాల్లో ఉంటున్న వారికీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా అని ఫిక్స్ అవడమే. అయితే తాజాగా ఓ హీరోయిన్ తన భర్త కి కరోనా లక్షణులుంటే.. హాస్పిటల్ సిబ్బంది తమని బలవంతంగా పంపేశారని అంటుంది. ఆమె ఎవరో కాదు. ఒకప్పుడు గ్లామర్ గర్ల్..ప్రస్తుతం పెళ్లి చేసుకుని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీయ శరణ్, రష్యాకి చెందిన ఆటగాడు ఆండ్రిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న శ్రియ శరణ్ ప్రస్తుతం స్పెయిన్ లో భర్తతో కలిసి ఉంటుంది అయితే ప్రస్తుతం ఆండ్రీ పొడి దగ్గుతోను, జ్వరంతోను భాధపడుతున్నాడట.

అయితే స్పెయిన్ లో కరోనా విజృంభిస్తుండడంతో… హాస్పిటల్ కి వెళ్లిన శ్రీయ దంపతులను టెస్ట్ చేసి కరోనా లేదని.. ఇంటికి పంపేసారట. అయితే కరోనా లేకుండా హాస్పిటల్ లో ఉంటె కరోనా త్వరగా వస్తుంది అని… తమని ఇంటికి పంపేశారని చెబుతుంది శ్రీయ. ఇక ఇంటికొచ్చాక కూడా తాము ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నామని చెబుతుంది శ్రియ. ఇక తామిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ….. వేరు వేరు గదుల్లో పడుకుంటున్నామని… ఆండ్రీ కి ఇంకా దగ్గు వస్తుంది అని, భౌతికంగా దూరం పాటిస్తున్నాం దేవుడి దయవల్ల ఆండ్రీ ఆరోగ్యం కుదురుపడుతుంది అని చెప్పుకొచ్చింది శ్రీయ. 

Tags:    

Similar News