బ్రేకప్ పై స్పందించిన శృతి హాసన్!

కమల్ హాసన్ కూతురు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు వరస సినిమా అవకాశాలు వస్తున్నా తరుణంలో నటనకు బ్రేక్ ఇచ్చి తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ [more]

;

Update: 2019-06-15 09:15 GMT

కమల్ హాసన్ కూతురు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు వరస సినిమా అవకాశాలు వస్తున్నా తరుణంలో నటనకు బ్రేక్ ఇచ్చి తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో ప్రేమలో పడడం…ఇద్దరు కలిసి లండన్ వెళ్లిపోవడం జరిగింది. అక్కడ ఆమె తనకు ఇష్టమైన మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూ ఉన్న తరుణంలో ఇద్దరు బ్రేక్ అప్ చెప్పుకుని విడిపోయారు. కారణాలు ఏమి చెప్పలేదు కానీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో శృతి తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించింది.

ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని ఆ తరువాతే విడిపోదామని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తన సంతోషంగా ఉండడమే తనకు ముఖ్యమని.. ప్రస్తుతం సింగిల్ గా హ్యాపీగా ఉన్నానని తెలిపింది. తమ బ్రేక్ అప్ గురించి తెలిసిన తన ఫ్రెండ్స్ షాక్ అయ్యారు అని తెలిపింది. మనం అనుకున్నవన్నీ జరగవు అంటూనే బ్రేకప్ తర్వాత తన హృదయానికి కలిగిన బాధపై కూడా ఒక పాట రాసాను అని చెబుతుంది. ప్రస్తుతం ఆమె నటన వైపు ఫోకస్ పెట్టిన ఈమెకు తమిళంలో ఒక సినిమా.. హిందీలో ఒక సినిమా ఛాన్స్ వచ్చింది.

Tags:    

Similar News