అబద్దం చెప్పి దొరికిపోయిన శ్రీలీల..

శ్రీలీల అబద్దం చెప్పింది. ఇదిగో ప్రూఫ్ అంటూ ఒక వీడియో షేర్ చేసి ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్.

Update: 2023-10-28 10:34 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల హవా నడుస్తుంది. నవీన్ పోలిశెట్టి నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరి సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకునే ప్రయత్నంలో ఉంది. రీసెంట్ గా ఈ భామ రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. రామ్ 'స్కంద' సినిమాలో హీరోయిన్ గా చేస్తే.. బాలయ్య 'భగవంత్ కేసరి'లో హీరోతో పాటు ప్రధాన పాత్ర చేసి సినిమాని ముందుకు తీసుకు వెళ్ళింది.

ఇప్పుడు మరో సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తుంది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి 'కేశవ' అనే సినిమాలో నటిస్తుంది. దీంతో ఇటు ఈ మూవీ ప్రమోషన్స్, అటు భగవంత్ కేసరి సక్సెస్ టూర్‌లతో తెగ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ప్రింట్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల చేసిన కామెంట్స్.. అబద్దం అని నిరూపిస్తూ నెటిజెన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అసలు శ్రీలీల చేసిన కామెంట్స్ ఏంటి..? నెటిజెన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు..?
ఆ ఇంటర్వ్యూలో శ్రీలీలని.. 'సన్నివేశం డిమాండ్ చేస్తే లిప్‌కిస్ చేస్తారా' అని ప్రశ్నించారు. దీనికి శ్రీలీల బదులిస్తూ.. "నేను లిప్‌కిస్ సన్నివేశాలు అసలు చేయను. ఏ హీరో అయినా నో అనే చెబుతాను. నేను లిప్‌కిస్ అంటూ ఇస్తే అది నా భర్తకే ఇస్తాను" అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ కామెంట్స్ విన్న కొంతమంది ఆడియన్స్.. ముందుగా ఇలాగే చెబుతారు. కానీ ఆ తరువాత సీన్, స్క్రిప్ట్ అని కబుర్లు చెబుతారు. ఇలాంటి మాటలు ఎంతమంది హీరోయిన్స్ చెప్పలేదు అంటూ కామెంట్స్ చేశారు.
అయితే కొందరు నెటిజెన్స్ ఈ కామెంట్స్ తీసుకోని.. శ్రీలీల అబద్దం చెప్పింది. ఇదిగో ప్రూఫ్ అంటూ ఒక వీడియో షేర్ చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ పరిచయం అవుతూ చేసిన సినిమా 'కిస్'. కన్నడ సినిమా అయిన దీనిలో ఒక సాంగ్ లో శ్రీలీల హీరో విరాట్ కి లిప్‌కిస్ ఇస్తుంది. మొదటి సినిమాలోనే లిప్‌కిస్ ఇచ్చేసి ఇప్పుడు.. మొదటి ముద్దు భర్త కోసమని కబుర్లు చెబుతుందని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.


Tags:    

Similar News