టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పలువురు ప్రముఖ నటులు, దర్శకులపై ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఆమె ఓ మళయాళి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, ఈ యుద్ధంలో తన వెంట ఎవరూ లేరని, ఒంటరిగానే పోరాడుతున్నాని వాపోయారు. తాను బాధితురాలినని, కానీ, తనను విమర్శించడం వల్ల తన కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. తనకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఉందన్నారు. ఓ మళయాళి నటిపై ఈ విధంగా దాడి చేస్తే ఇండస్ట్రీ మొత్తం ఆమెకు అండగా ఉందని, కానీ ఇక్కడ మాత్రం తాను ఒంటరిగా పోరాడుతున్నానన్నారు. శ్రీరెడ్డిపై తాజాగా విరాహి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె డబ్బుల కోసం ప్రముఖులను బెదిరిస్తుందని ఆయన ఆరోపించారు.