మా మధ్యన ఏం లేదు!!

రవికి శ్రీముఖి మధ్యన ఏదో ఉంది.. వారిద్దరూ కలిసి పటాస్ చేసినప్పుడు ఇద్దరూ ప్రేమలో పడితే.. రవి మాత్రం శ్రీముఖికి పెళ్లయింది అని చెప్పకుండా మోసం చెయ్యడంతో [more]

Update: 2020-04-09 10:53 GMT

రవికి శ్రీముఖి మధ్యన ఏదో ఉంది.. వారిద్దరూ కలిసి పటాస్ చేసినప్పుడు ఇద్దరూ ప్రేమలో పడితే.. రవి మాత్రం శ్రీముఖికి పెళ్లయింది అని చెప్పకుండా మోసం చెయ్యడంతో శ్రీముఖి చాలా హార్ట్ అయ్యింది… అందుకే బిగ్ బాస్ సీజన్ 3 హౌస్ లో ఉండగా…. ఒకతను నన్ను మోసం చేసాడు… షూటింగ్ మధ్యలో నేను రూమ్ కి వెళ్లి సూయిసైడ్ చేసుకొందామనుకున్నా అంటూ ఎమోషన్ అయ్యింది అయినా శ్రీముఖిని చూసిన అందరూ నిజంగానే యాంకర్ రవి శ్రీముఖిని మోసం చేసాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులోనూ శ్రీముఖి చెప్పాక వారిద్దరూ కలిసి షో చెయ్యకుండా, ఒకరి గురించి ఒకరు మాట్లాడకుండా ఉండేసరికి శ్రీముఖిని మోసం చేసింది యాంకర్ రవినే అంటూ అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక నాకు శ్రీముఖి కి నాకు మధ్యన గొడవ జరగలేదు మేమెప్పటికీ ఫ్రిండ్స్ అన్నా జనాలు వినలేదు.

మరి ఉప్పు నిప్పు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ శ్రీముఖి, రవి కలిసి అలీతో జాలిగా ప్రోగ్రాం కి రావడం ఇద్దరూ చక్కగా ఫ్రెండ్స్ లా కలిసిమెలిసి ఉండడమే కాదు…. మా మధ్యన అందరూ అనుకుంటున్నట్టు ఏం లేదు అంటూ చెప్పుకొచ్చారు. సాధారణంగా షోస్ చేస్తున్నపుడు చేతులు పట్టుకోవడం, దగ్గరకు తీసుకుని హగ్ ఇవ్వడం లాంటివి చేస్తుంటే ఇలాంటి రూమర్స్ రావడం సహజమే అంటున్నారు శ్రీముఖి, రవి లు కలిసి. ఇక శ్రీముఖి అంటే ఇష్టమని చెబుతున్నాడు రవి.

Tags:    

Similar News