శ్రీముఖి బ్రేకప్ చెప్పింది అతడికేనా?

నిన్న జరిగిన బిగ్ బాస్ సీక్రేట్ లైఫ్ లో శ్రీముఖి తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన వార్త బయట పెట్టింది. ఫైనల్ కు మరో వారం [more]

Update: 2019-10-25 08:02 GMT

నిన్న జరిగిన బిగ్ బాస్ సీక్రేట్ లైఫ్ లో శ్రీముఖి తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన వార్త బయట పెట్టింది. ఫైనల్ కు మరో వారం ఉంది అనగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని తమ సీక్రేట్ లైఫ్ గురించి చెప్పాలంటూ ఇచ్చిన టాస్క్ లో శ్రీముఖి తన రిలేషన్ గురించి ఓపెన్ అయిపొయింది. గతంలో తనకు ఓ లవ్ స్టోరీ ఉండేదని..అన్ని సెట్ అయ్యి పెళ్లి చేసుకోవడమే లేట్ అనుకున్న టైములో ఇద్దరి మధ్య పర్సనల్ లైఫ్.. మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్ గురించి లేనిపోని మనస్పర్థలు వచ్చాయని..అందువలన మేము బ్రేక్ అప్ చేసుకోవాల్సి వచ్చిందని ఓపెన్ అయింది శ్రీముఖి. అతను ఓ సెలెబ్రిటీ అని కూడా చెప్పింది.

అతడేనా…?

బ్రేక్ అప్ తరువాత చాలా సార్లు చచ్చిపోద్దాం అనిపించింది అని ఎన్నోసార్లు మేకప్ రూమ్ పక్కకు వెళ్లి వెక్కివెక్కి ఏడ్చానని గుర్తు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ శ్రీముఖి లైఫ్ లో ఉన్న ఆ హీరో కమ్ విలన్ ఎవరనేది ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో శ్రీముఖి – యాంకర్ రవి ల మధ్య ఏదో ఉందని..ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. లాస్య వెళ్లిన తర్వాత శ్రీముఖితోనే అంత కెమిస్ట్రీ పండించాడు రవి. ఇద్దరు చేసిన పటాస్ షో బ్లాక్ బస్టర్ అయింది. కానీ సడన్ గా శ్రీముఖి అనుకోని కారణాలతో పటాస్ నుంచి బయటికి వచ్చేసింది. కారణాలు మాత్రం తెలియదు. బహుశా శ్రీముఖి చెప్పిన కథలో హీరో కూడా రవి అయ్యుండొచ్చు అంటున్నారు ప్రేక్షకులు. లేకపోతే ప్రదీప్ కూడా అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు చాలామంది. మరి ఆమె లైఫ్ లో ఉన్న ఆ హీరో ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.

 

Tags:    

Similar News