'పెద్ద కాపు' టైటిల్ వెనుక కారణం ఏంటి..? ఆ సామజిక వర్గం..!

శ్రీకాంత్ అడ్డాల తన కొత్త మూవీకి పెద్దకాపు అని ఒక ఒక సామజిక వర్గానికి సంబంధించిన టైటిల్ ని ఎందుకు పెట్టాడు..? ఈ సినిమా ఆ వర్గానికి చెందిందా..?

Update: 2023-09-26 12:42 GMT

టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. ఫ్యామిలీ, లవ్ ఎమోషనల్ సినిమాల నుంచి టర్న్ తీసుకోని మాస్ సినిమాలు వైపు ప్రయాణం మొదలు పెట్టాడు. 2021లో హీరో వెంకటేష్ తో 'నారప్ప' సినిమా తీసి తనలోని మాస్ డైరెక్టర్ ని బయట పెట్టాడు. ఇప్పుడు రెండేళ్ల గ్యాప్ తీసుకోని మరో మాస్ మూవీతో రాబోతున్నాడు. కొత్త నటీనటులను ప్రధాన పాత్రల్లో పెట్టి 'పెద్ద కాపు' అనే ఒక న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్‌ ని తెరకెక్కించాడు.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. ఫస్ట్ పార్ట్ ఈ నెల 29న రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీకి పెద్దకాపు అని ఒక ఒక సామజిక వర్గానికి సంబంధించిన టైటిల్ ని ఎందుకు పెట్టారు..? ఈ సినిమా ఆ వర్గానికి చెందిందా..? అనే సందేహం అందరిలో నెలకుంది. శ్రీకాంత్ అడ్డాల కూడా ఆ వర్గానికి చెందిన వాడే కావడంతో ఆ సందేహం మరింత బలపడింది. అయితే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటో శ్రీకాంత్ అడ్డాల తెలియజేశాడు.
ఈ సినిమా లొకేషన్స్ వెతికే పనిలో ఒక ఉరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బస్సు షెల్టర్ పై ఒక వ్యక్తి పేరు చూశాడట. ఆ పేరు రెడ్డి అనే పదంతో ఉంది. అయితే ఆ పేరుకి ముందు పెద్దకాపు అని కనిపించింది. ఇదేంటి రెండు వర్గాలకు చెందిన పదాలు ఒక వ్యక్తి పేరులో ఉన్నాయనే సందేహంతో అక్కడే ఉన్న పెద్ద మనిషిని శ్రీకాంత్ అడ్డాల తన సందేహం గురించి అడిగాడు. దానికి ఆ వ్యక్తి సమాధానమిస్తూ.. "పెద్దకాపు అనేది కులం కాదు కరణం, మునసబులా అది ఒక టైటిల్" అని చెప్పాడట.
ఒక వ్యక్తి నలుగురికి పని చూపించి, వారితో పాటు అతను కూడా పనిలోకి దిగితే.. ఆ వ్యక్తినే పెద్దకాపు అని అంటరాని చెప్పాడట. ఇక అది మూవీకి కూడా యాప్ట్ గా ఉండడంతో.. అక్కడి నుంచే నిర్మాతకు ఫోన్ చేసి సినిమాకి పెద్ద కాపు టైటిల్ పెడదాం అనుకుంటున్నా అని చెప్పాడట. దానికి నిర్మాత నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ టైటిల్ ని ఫిక్స్ చేసేశారు. కాగా ఈ మూవీతో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.


Tags:    

Similar News