మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. అదిరిపోయిందిగా... అనిల్ కానుక

మెగా అభిమానులకు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తీపి కబురు తెలిపారు;

Update: 2025-03-26 12:15 GMT
anil ravipudi,chiranjeevi, good news,  mega fans
  • whatsapp icon

మెగా అభిమానులకు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తీపి కబురు తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ జిరంజీవి పేరు శంకర వరప్రసాద్ అని ఆయన ట్వీట్ చేయడం ఫ్యాన్స్ కు పండగలాంటి కబురు. తన సినిమా కథకు సంబంధించి స్క్రిప్ట్ ను పూర్తిగా వినిపించడం పూర్తయిందని, మెగాస్టార్ ఓకే చెప్పారంటూ ఆసక్తికరమైన ట్వీట్ ను ఎక్స్ లో పెట్టారు. తన కథలో పాత్రను చిరంజీవిని శంకర్ వరప్రసాద్ గా పరిచయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పటాస్ నుంచి నిన్నటి సంక్రాంతికి వస్తున్నాం వరకూ...
అనిల్ రావిపూడి పటాస్ నుంచి మొన్నటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకూ వరస హిట్లు అందించి ఇండ్రస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకున్నారు. ఏ దర్శకుడికి లేనంత విక్టరీని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి మెగా అభిమానులను మాస్ + కామెడీతో అలరించేందుకు స్క్రిప్ట్ ను రెడీ చేశారు. స్క్రిప్ట్ చదివిన మెగాస్టార్ హ్యాపీగా ఫీలవ్వడంతో త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో హిట్ కోసం అనిల్ రావిపూడి ఈ మూవీని సిద్ధం చేస్తున్నారు.
వచ్చే సంక్రాంతికి విడుదల...
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలతో ఒక్ సినిమాను చేయనున్నారు. ఆ తర్వాత మాత్రమే అనిల్ రావిపూడి + మెగాస్టార్ కాంబినేషన్ లో మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారన్న టాక్ టాలీవుడ్ లో ఇప్పటికే ప్రచారం ఉంది. అందులో ఒకరు ఆదితిరావు హైదరి పేర్లు పరిశీలనలో ఉంది. సంగీతం భీమ్ గా నిర్ణయించార. ఈ మూవీలో చిరంజీవి ఒరిజినల్ నేమ్ వరప్రసాద్ పేరును వాడుతూ అభిమానులను స్క్రీన్ వైపునకు మరింతగా లాగేసుకోవడానికి అనిల్ రావిపూడి చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ప్రయత్నిస్తుందో చూడాలి. యాక్షన్ + కామెడీ మూవీ కావడంతో సూపర్ డూపర్ హిట్ అయి బాక్సాఫీసును బద్దలు కొట్టడం ఖాయమన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.


Tags:    

Similar News