సుకుమార్ చెప్పింది విని మైత్రి వారు అలా చేశారా?

సుకుమార్ కి మైత్రి మూవీస్ వారికీ విడదీయలేని అనుబంధం ఉంది. మంత్రి మూవీస్ లో ఒకడిగా సుకుమార్ రంగస్థలం ముందు నుండే కలిసిపోయాడు. రంగస్థలం తరవాత సుకుమార్ [more]

Update: 2019-04-12 05:16 GMT

సుకుమార్ కి మైత్రి మూవీస్ వారికీ విడదీయలేని అనుబంధం ఉంది. మంత్రి మూవీస్ లో ఒకడిగా సుకుమార్ రంగస్థలం ముందు నుండే కలిసిపోయాడు. రంగస్థలం తరవాత సుకుమార్ – మైత్రి వారి బంధం మరింతగా బలపడింది. అయితే ఇపుడు టాలీవుడ్ లో సుకుమార్ చెబితే మైత్రి మూవీస్ వారు కావాలనే ఒక సినిమా ఆపేశారనే న్యూస్ నడుస్తుంది. గత రెండు రోజులుగా మైత్రి మూవీస్ నిర్మాణంలో పట్టాలెక్కడానికి రెడీ అవుతున్న రవితేజ – సంతోష శ్రీనివాస్ ల తమిళ రీమేక్ తేరి సినిమా తెలుగులో కనకదుర్గగా మొదలవ్వబోయే క్షణంలో ఆ సినిమాని మైత్రి వారు ఆపేశారనే ప్రచారం జరుగుతుంది.

2016 లో తమిళంలో హిట్ అయిన తేరి సినిమాని ఇప్పుడు రీమేక్ చేస్తే వర్కౌట్ అవ్వదని మైత్రి వార్ ఆపేసినట్లుగా చెబుతున్నారు కానీ… దీని వెనక సుకుమార్ హస్తం ఉన్నట్లుగా ఒక న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. సుకుమార్ దర్శకుడిగానే కాకుండా చిన్న చిన్న సినిమాల నిర్మాణం కూడా చేపడుతున్నాడు. అయితే మైత్రి వారితో ఉన్న అనుబంధంతో సుకుమార్ మైత్రి వారు కమిట్ అయిన సినిమాల కథలను ప్రతిదీ సుకుమార్ కూడా విన్నాకే ఫైనల్ చేస్తున్నారట. అందులో భాగంగానే సుకుమార్ తేరి రీమేక్ ని చేస్తే రొటీన్ మాస్ ఫార్ములా ల కథలా ఉంటుంది కానీ.. దాని వలన సినిమా కమర్షియల్ సక్సెస్ కాదని… ప్రేక్షకుడికి రొటీన్ ఫార్ములా కథలు ఎక్కవని సుకుమార్ చెప్పడంతోనే మైత్రి మూవీస్ వారు తేరి రీమేక్ కి మంగళం పాడినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆపేసినా మైత్రి మూవీస్ వారు సంతోష్ శ్రీనివాస్ తో మరో సినిమా తప్పక చేస్తామని మాటిచ్చినట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News