అల్లు అర్జున్ ని సీరియస్ గా తీసుకున్న డైరెక్టర్..!

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్ కి ఇప్పుడు నిజంగానే సినిమా కష్టాలంటే ఏంటో తెలిసొచ్చేలా కనబడుతుంది వ్యవహారం. స్టార్ హీరో మహేష్ తో [more]

Update: 2019-05-08 05:56 GMT

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్ కి ఇప్పుడు నిజంగానే సినిమా కష్టాలంటే ఏంటో తెలిసొచ్చేలా కనబడుతుంది వ్యవహారం. స్టార్ హీరో మహేష్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్స్ తో సుకుమార్ ఒక ఏడాదిగా ప‌డిన కష్టం మొత్తం ఎగిరిపోయింది. ఫుల్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమా మొదలు పెడదామని సుకుమార్ కి మహేష్ చెప్పడంతో సుకుమార్ – మహేష్ కాంబో ఆగిపోయింది. కాకపోతే మహేష్ మాత్రం సుకుమార్ తో ఫ్యూచర్ లో సినిమా ఉంటుందని కవర్ చేస్తున్నాడు. ఇక సుకుమార్… మహేష్ కథతోనే అల్లు అర్జున్ తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఈ నెలలోనే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబో మూవీ మొదలవ్వబోతుంది. అయితే స్టార్ హీరోలతో ఎంతో జాగ్రత్తగా లేకపోతె మొదటికే మోసం వస్తూండని సుకుమార్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడేమో అందుకే.. ఇప్పుడు అల్లు అర్జున్ తో చెయ్యబోయే సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లుగా కనబడుతున్నాడు.

తిరుమ‌ల అడ‌వుల్లో లోకేష‌న్ల కోసం

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో తెరక్కనున్న సుకుమార్ – అల్లు అర్జున్ చిత్రం కోసం సుకుమార్ తిరుమల శేషాచ‌లం అడవుల్లో రెక్కీ నిర్వహిస్తున్నాడట. తిరుమల అడవుల్లో అల్లు అర్జున్ కోసం లొకేషన్స్ ని సెట్ చేసుకునే పనిలో తలమునకలై ఉన్నాడట సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం అక్కడి లొకేషన్స్ ను ఎంచుకున్నాడట సుకుమార్. దీనిని బ‌ట్టి అల్లు అర్జున్ కోసం సుకుమార్ ఎంత సీరియస్ గా ఉన్నాడో చూస్తే తెలుస్తుంది. మరి అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమాతో పాటుగా సుకుమార్ సినిమా కూడా అల్లు అర్జున్ చేయబోతున్నాడట. ఇక సుకుమార్ – బన్నీ మూవీ ఈ నెల 11న మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం.

Tags:    

Similar News