మాస్టారు నాకు తండ్రి లాంటి వారు

మనం ముందు నుంచి ఊహించినట్లే నిన్న తమన్నా ఎలిమినేట్ అయింది. ఇక అంతకుముందు హేమ, జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. నిన్న గెస్ట్ గా వచ్చిన వెన్నెల కిషోర్ [more]

Update: 2019-08-12 08:51 GMT

మనం ముందు నుంచి ఊహించినట్లే నిన్న తమన్నా ఎలిమినేట్ అయింది. ఇక అంతకుముందు హేమ, జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. నిన్న గెస్ట్ గా వచ్చిన వెన్నెల కిషోర్ కాసేపు అందరిని నవ్వించి ఎలిమినేషన్ ప్రక్రియ జరిపారు. ఈ ప్రక్రియ లో వెన్నెల కిషోర్ ముందుగా బాబా మాస్టర్ ని సేవ్ చేయడం జరిగింది. దీనికి ముందు నాగ్ రాహుల్, పునర్వవిని లని నాగ్ సేవ్ చేసాడు.

థ్రిల్లింగానే….

ఇక మిగిలింది వితిక.. తమన్నాల్లో ఎవరో ఒకరు హౌస్ నుంచి వెళతారని హోస్ట్ నాగార్జున ప్రకటించడం ఇవన్నీ డ్రమటిక్ గా ఎమోషన్ ని పెంచాయి. నాగార్జున మొత్తానికి షో ని కొంచం థ్రిల్లింగ్ గానే నడిపారు.వితిక.. తమన్నాల్లో లో తమన్నా ఎలిమినేట్ అవ్వడం ఆమె నవ్వుతు నాగ్ దగ్గరకు రావడం వెంటనే ఆమె కు హౌస్ సభ్యులపై ఉన్నదున్నట్టు మాట్లాడే ఛాయిస్ ఇచ్చారు.

ఎమోషనల్ అయి….

ఆమె ముక్కు సూటిగా మాట్లాడింది. వరుణ్ తేజ్- వితిక జంటను కన్నింగ్ అంటూ తప్పు పట్టారు తమన్నా. ఇక రాహుల్ పై చాలా కోపం ఉన్నట్టు అర్ధం అయింది. రవిపై అలకబూనారు. శ్రీముఖి .. శైలు.. హిమజ లవ్ లీ పర్సనాలిటీస్ అని కితాబిచ్చింది. ఇక బాబా భాస్కర్ ని అయితే తెగ పొగిడేసింది. ఆయన నాకు తండ్రి లాంటి వారు అని ఆయన కూతురు గా నేను పుట్టి ఉంటే వేరేలా ఉండేదాన్ని అని ఎమోషనల్ చెప్పింది.

Tags:    

Similar News