రాజమౌళి ని తెగ పొగిడేస్తోంది!!

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తో ఎంతో మంది నటులు పని చెయ్యాలి అనుకుంటారు. కానీ అయన మాత్రం కొందరికే అవకాశం ఇస్తాడు. ఒకసారి అవకాశం ఇచ్చాం కదా [more]

;

Update: 2020-07-05 09:06 GMT
తమన్నా
  • whatsapp icon

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తో ఎంతో మంది నటులు పని చెయ్యాలి అనుకుంటారు. కానీ అయన మాత్రం కొందరికే అవకాశం ఇస్తాడు. ఒకసారి అవకాశం ఇచ్చాం కదా అని.. మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చే టైప్ కాదు.. అయినా రాజమౌళి సినిమాలో ఒకరిని అనుకున్నారంటే.. అది వాళ్ళ అదృష్టమే. ఇక వాళ్ళ కి రాజమౌళి నుండి ఫోన్ వచ్చింది అంటే.. .. ఆ అవకాశం వాళ్ళకి రాసిపెట్టినట్టే అంటుంది ఓ హీరోయిన్. ఆమె బాహుబలి పార్ట్ వన్ లో మెయిన్ లీడ్ చేసిన తమన్నా. రాజమౌళి తనని హీరోయిన్ గా తీసుకున్నందుకు ఆయనకి ధన్యవాద;లు చెప్పే ప్రోగ్రాం పెట్టింది. అంతేకాదు.. రాజమౌళి ని తెగ పొగిడేస్తోంది. తనకి బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీ లో అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

అంతేకాకుండా ఒకసారి తనతో పనిచేశారు కదా అని రాజమౌళి మరోసారి నటీనటులకు ఆయన అవకాశం ఇవ్వరు. రాజమౌళి అనుకున్న పాత్రకు ఎవరైతే కరెక్ట్‌గా సరిపోతారు అని భావిస్తేనే రాజమౌళి ఆయా నటీనటులకు అవకాశం కలిపిస్తారని అంటుంది. ఒకవేళ రాజమౌళి  దగ్గరి నుంచి ఎవరికైనా ఫోన్ వచ్చిందంటే.. ఆ పాత్ర వారికి కచ్చితంగా రాసిపెట్టినట్లే అని చెబుతుంది. మరి నిన్నగాక మొన్న వారసత్వం గురించి మాట్లాడిన తమన్నా ఇప్పుడు రాజమౌళిని పొగిడేస్తోంది.. అంటే తదుపరి సినిమాలో ఎమన్నా ఓ కేరెక్టర్ ఎక్సపెక్ట్  చేస్తుందేమో   అంటున్నారు నెటిజెన్స్. 

Tags:    

Similar News