రాజమౌళి వదిలేసాడు.. బోయపాటి పట్టేసాడు..!

రాజమౌళి సినిమాల విషయంలో అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు చెక్కుతూనే ఉంటాడు. అందుకే జక్కన్న తెరకెక్కించే సినిమాలన్నీ ఓ అపురూప కళాఖండాలె. ఇక జక్కన్న దర్శకత్వంలో [more]

Update: 2019-03-14 07:04 GMT

రాజమౌళి సినిమాల విషయంలో అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు చెక్కుతూనే ఉంటాడు. అందుకే జక్కన్న తెరకెక్కించే సినిమాలన్నీ ఓ అపురూప కళాఖండాలె. ఇక జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సెట్స్, సినిమాని తెరకెక్కించిన విధానంలో ఆయనని పొగడని వారు లేరు. అందుకే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా అమరావతి నిర్మాణంలో అలాగే అమరావతిలో కట్టబోయే భవంతుల విషయంలో రాజామౌళి సలహాలు సూచనలు తీసుకున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి చాలాసార్లు అమరావతికి వెళ్లి వచ్చాడు కూడా. అయితే తాజాగా 2019 ఎన్నికల విషయంలో కూడా చంద్రబాబు రాజమౌళి సహాయం తీసుకోవాలని అనుకుని రాజమౌళిని సంప్రదించాడట.

రాజమౌళి బిజీగా ఉండటంతో…

టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యాడ్స్ రూపంలో తెరకెక్కించమని రాజమౌళిని అడగగా ఆయన సున్నితంగా తిరస్కరించాడట. తాను భారీ మల్టీస్టారర్ #RRRతో బిజీగా ఉండడంతో టీడీపీ యాడ్స్ చేయలేనని చెప్పడాట. దీంతో ఆ బాధ్యతని బాబు మరో టాలెంటెడ్ డైరెక్టర్ బోయపాటికి ఇచ్చాడు. వినయ విధేయ రామ ఫ్లాప్ తో ఉన్న బోయపాటి ప్రస్తుతం టీడీపీ యాడ్స్ మేకింగ్ లో బిజీ అయ్యాడు. పార్టి ప్రమోషనల్ యాక్టివిటీస్ ని డైరక్ట్ చేస్తూ అందుకు తగ్గ కంటెంట్ ని రెడీ చేస్తున్నాడు. అందులోనూ చంద్రబాబుకి గోదావరి పుష్కరాల నుండి బోయపాటి పరిచయమే. బాలకృష్ణకి సన్నిహితుడైన బోయపాటి బాబుకి దగ్గరయ్యాడు. ఇక పుష్కరాలప్పుడు ప్రభుత్వానికి ఫేవర్ గా యాడ్స్ కూడా చేసాడు. తన అసిస్టెంట్స్ తో యాడ్ కాన్సెప్ట్ లు రెడీ చేయించడం, ప్రమోషనల్ వీడియోలు షూట్ చేస్తున్నాడట బోయపాటి.

Tags:    

Similar News