RRR లో భారీ ట్విస్ట్ అదేనా?

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న RRR పై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా…. ఎన్టీఆర్ కొమరం భీం [more]

;

Update: 2020-04-20 07:59 GMT
ajay devagan acting in rrr
  • whatsapp icon
#RRR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న RRR పై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా…. ఎన్టీఆర్ కొమరం భీం గా విప్లవ వీరుల పాత్రలు పోషిస్తుంటే. అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా RRR  షూటింగ్ వాయిదా పడితే…ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ చేస్తున్నామని రాజమౌళి చెబుతున్నాడు. గ్రాఫిక్స్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ వగైరా పనులను ఎవరికీ వారే ఇంటి నుండి చక్కబెడుతున్నారు.

NTR inn RRR

అయితే ప్రస్తుతం RRR విషయంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ లు యంగ్ ఏజ్ లోనే దొరల అన్యాయాలను చూసి సహించలేక.. వారిని ఎదిరించలేక.. అందరికి దూరంగా పారిపోయి అజ్ఞాతవాసం గడుపున్న వీరి ఇద్దరికి అజయ్ దేవగన్ పరిచయం అవడం, వీళ్ళిద్దరిని గొప్ప పోరాట యోధులుగా మార్చడానికి అజయ్ దేవగన్ వీరికి గురువుగా మరి.. వారిని యుద్ధ విద్యల్లో పోరాట యోధులుగా తీర్చి దిద్ది.. వారిలో కసిని పెంచి.. దొరల మీదకి ప్రయోగిస్తాడని.. అంటున్నారు. మరి అజయ్ దేవగన్ పాత్ర ఈ సినిమాలో కథని మలుపు తిప్పే పాత్ర అని ఎప్పటినుండో.. ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. మోదటినుండి అజయ్ దేవగన్ పాత్ర మీదే ఈతరహా ప్రచారమే జరుగుతుంది.

Tags:    

Similar News