వరుణ్ టార్గెట్ భారీగానే ఉంది

హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబోలో తమిళ సూపర్ హిట్ జిగర్తాండకి రీమేక్ గా తెరకెక్కిన వాల్మీకి రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. తమిళంలో ఆ [more]

;

Update: 2019-09-18 06:59 GMT

హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబోలో తమిళ సూపర్ హిట్ జిగర్తాండకి రీమేక్ గా తెరకెక్కిన వాల్మీకి రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. తమిళంలో ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో.. తెలుగు వాల్మీకి కూడా మంచి ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది. స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గెస్ట్ రోల్, వాల్మీకి గా వరుణ్ తేజ్ మాస్ అప్పీల్, ఆయన లుక్స్ అన్ని సినిమా మీద అంచనాలు పెరిగేలా చేశాయి. అందులోని మెగా ఫాన్స్ ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి కోసం బాగా ఎదురు చూస్తున్న టైంలో వరుణ్ వాల్మీకి రిలీజ్ అవడంతో.. మెగా ఫాన్స్ కూడా ఉత్సాహంతో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మరి వరుణ్ గత సినిమాల హిట్స్ తో ఇప్పుడు వాల్మీకి సినిమా విడుదలకు ముందే మంచి బిజినెస్ జరిగింది. వాల్మీకి వరల్డ్ వైడ్ గా 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. మరి ఆ అంచనాలు… ఆ టార్గెట్ ని వరుణ్ సై రా సినిమా థియేటర్స్ లోకి దిగేసరికల్లా అందుకోవాల్సి ఉంటుంది.

ఏరియా బిజినెస్ (కోట్లలో)

నైజాం 7.40

సీడెడ్ 3.35

నెల్లూరు 0.75

కృష్ణ 1.60

గుంటూరు 1.80

వైజాగ్ 2.40

ఈస్ట్ గోదావరి 1.60

వెస్ట్ గోదావరి 1.10

టోటల్ ఏపీ & టీస్ 20.00

ఇతర ప్రాంతాలు 1.50

ఓవర్సీస్ 3.50

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 25.00

 

Tags:    

Similar News