యూఎస్ లో సైరా ఆ మార్క్ అందుకుంటుందా?

సైరా మూవీ తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 50 కోట్ల మేర షేర్ వసూలవ్వడం చర్చకు వచ్చింది. ఓవర్సీస్ లో ఈ మూవీ ప్రీమియర్స్ తో కలుపుకుని [more]

Update: 2019-10-05 08:54 GMT

సైరా మూవీ తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 50 కోట్ల మేర షేర్ వసూలవ్వడం చర్చకు వచ్చింది. ఓవర్సీస్ లో ఈ మూవీ ప్రీమియర్స్ తో కలుపుకుని తొలి రోజు 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. ఇక రెండో రోజు మాత్రం ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు అమెరికాలోనూ వసూళ్లలో డ్రాప్ కనిపించింది. దీనికి కారణాలు అనేకం.

రెండు రోజులు చూడాలి…

అమెరికాలో ఈ మూవీ ఓవరాల్ గా 1.2 మిలియన్ డాలర్లు మాత్రమే వసూళ్లు చేసింది. దీనిబట్టి సైరా కు అన్ని సినిమాల్లో డ్రాప్స్ తప్పలేదని అర్థమవుతోంది. మరి శని, ఆదివారాలు వీకెండ్ హాలిడేస్ కాబట్టి ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో చూడాలి. మెగాస్టార్ కి ఉన్న ఛరిష్మా దృష్ట్యా తిరిగి విదేశాల్లోనూ కలెక్షన్ల రేంజు పెరుగుతుందనే అంచనా వేస్తున్నారు. రంగస్థలం- భరత్ అనే నేను చిత్రాలు 3 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయి. మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు సైరా మూవీ కూడా 3 మిలియన్ డాలర్ వసూళ్లు అందుకుంటుందా? లేదా అన్న ఆసక్తి నెలకొంది. సోమవారం రోజు వసూళ్ల పై పూర్తి క్లారిటీ వస్తుంది.

 

Tags:    

Similar News