మౌనిక రెడ్డి విడాకులు తీసుకుంటుందా..? నిజమెంత..?
షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపుని మౌనిక రెడ్డి ఇటీవల పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందా..?
తెలుగు అమ్మాయి మౌనిక రెడ్డి.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. దీంతో గత ఏడాది 'బీమ్లానాయక్' మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన ఒక ముఖ్య పాత్ర చేసే లక్కీ ఛాన్స్ ని అందుకుంది. ఆ సినిమాతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ ఫేమ్‌తో సినిమా ఆఫర్లు కూడా రావడం మొదలయ్యాయి. కానీ ఇంతలోనే తన స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్‌ని స్టార్ట్ అందరికి షాక్ ఇచ్చింది.
గత ఏడాది డిసెంబర్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు మధ్య గోవాలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంది. అందుకు సంబంధించిన పిక్స్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఏమైందో ఏమో ఇప్పుడు ఆ ఫోటోలు మౌనిక ఇన్‌స్టాలో కనిపించడం లేదు. దీంతో ఆమె ఆ ఫోటోలు డిలీట్ చేసింది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. ఇటీవల కాలంలో విడాకుల తీసుకోని విడిపోయిన సెలబ్రిటీస్ అంతా.. ముందుగా ఇలాగే ఫోటోలు డిలీట్ చేశారు.
దీంతో మౌనిక కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకుండానే విడాకులు తీసుకుంటున్నారా.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మౌనిక వీటిపై ఒక క్లారిటీ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో విడాకుల వార్తలు పై రియాక్ట్ అవుతూ ఒక స్టోరీ పెట్టింది. తన భర్తతో ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ.. తనకి తన భర్తకి మధ్య జరిగిన ఒక సరదా సంభాషణని రాసుకొచ్చింది.
మౌనిక.. 'మనం ట్రేండింగ్‌లో ఉన్నాం' అని విడాకుల వార్త భర్తకి చెప్పగా, అతను రియాక్ట్ అవుతూ.. 'ఏ ఖర్చు లేకుండా మనం ట్రెండ్ అవుతున్నాముగా' అనే అర్ధంతో సరదాగా బదులిచ్చాడు. దీంతో మౌనిక విడాకుల వార్తలో నిజం లేదని తేలిపోయింది. కాగా మౌనిక ప్రస్తుతం ఒక లేడీ ఓరియంటెడ్ పిరియాడికల్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో ఒక ముఖ్య పాత్ర చేస్తుంది.