ఈ శుక్రవారం మరీ చప్పగా ఉందే…!

జనవరి నెలలో ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. బడా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేశాయి. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీసు వద్దకు వచ్చిన [more]

Update: 2019-02-01 06:21 GMT

జనవరి నెలలో ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. బడా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేశాయి. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీసు వద్దకు వచ్చిన అనిల్ రావిపూడి – దిల్ రాజు ఎఫ్ 2 సినిమా మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా కూడా తుస్ మనేదే కానీ… థియేటర్స్ లో ఆకట్టుకునే సినిమాల్లేక ప్రేక్షకులకు ఎఫ్ 2 తప్ప మరో ఆప్షన్ కనబడలేదు. మొదటి భాగంలో కామెడీ అదిరిపోయినా.. సెకండ్ హాఫ్ బోరింగ్ గా ఉంది. అయినా ఎఫ్ 2ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు ప్రేక్షకులు. ఇక జనవరిలో వచ్చిన మిగతా సినిమాలు ఎన్టీఆర్ కథానాయకుడు, పేట, వినయ విధేయ రామ, మిస్టర్ మజ్ను, మణికర్ణిక ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి.

మిస్టర్ మజ్నుకు కలిసొస్తుందా..?

ఇక ఫిబ్రవరి 1 నిర్మాతలకు మంచి అవకాశం. ఎందుకంటే జనవరిలో సినిమాలు లేక బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ శుక్రవారం ఎలాంటి సినిమా వస్తుందో… చూసేద్దాం అనుకుంటే అసలు ఈ శుక్రవారం పేరున్న ఒక్క సినిమా కూడా బాక్సాఫీసు వద్దకు రావడం లేదు. అంటే ఈ శుక్రవారం చాలా చప్పగా ఉండబోతుంది. మరి ఇంత మంచి అవకాశాన్ని చాలామంది చిన్నా, పెద్ద నిర్మాతలు వదిలేసుకున్నట్టే. అసలు పెద్ద సినిమాల హడావిడిలో కొట్టుకుపోయే కన్నా.. థియేటర్స్ లేవని గగ్గోలు పెట్టే నిర్మాతలకు ఈ శుక్రవారం బాగా కలిసొచ్చేదే. కానీ ఎవ్వరూ ఈ వారం సినిమాలు రిలీజ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. అందుకే తన సినిమా ఫ్లాప్ అని తెలిసినా.. థియేటర్స్ లో మంచి సినిమాలేవీ లేవు కనక అఖిల్ తన మిస్టర్ మజ్ను సినిమాని ప్రమోషన్స్ తో లేపుదామనుకుంటున్నాడు. కాలేజెస్, థియేటర్స్ అంటూ తెగ హడావిడి చేస్తున్నాడు. ఏదేమైనా ఈ శుక్రవారం మాత్రం సినీ లవర్స్ ఉసూరుమనాల్సిందే.

Tags:    

Similar News