ఇప్పుడు టాలీవుడ్ వారానికో పెళ్లి ముచ్చటకి తెరలేస్తోంది. గత వారం నుండి మొదలైన ఈ పెళ్లి గోల మరో రెండు వరాల పాటు కొనసాగనుంది. అయితే ఈ మూడు పెళ్లిళ్లలో ఎన్ని పెళ్లిళ్లు సక్సెస్ అవుతాయో.. ఎన్ని పెళ్లిళ్లు ప్లాప్ అవుతాయో అనేది ప్రేక్షకులు ఇచ్చే తీర్పు బట్టే ఉంటుంది. గత వారం కొణిదెల నిహారిక - సుమంత్ అశ్విన్ జంటగా కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్ సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. ఈ సినిమాలో బలమైన కథ లేకపోవడం ప్రధాన మైనస్ అయితే.. నిహారిక నటన ప్లస్ పాయింట్. అలాగే పెళ్లి అంటేనే పెద్ద పండగ లాంటిది. అలాగే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. ఆ సినిమా టాక్ యావరేజ్ అనిపించుకోలేకపోయింది.
ఈ సినిమాతోనైనా నిలదొక్కుకుంటాడా..?
ఇక రేపు శుక్రవారం మరో పెళ్లి థియేటర్స్ లోకి దిగనుంది అక్కినేని గారి మనవడు... హీరో గా నిలదొక్కుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నాడు. వరస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న సుశాంత్ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చి ల సౌ సినిమా చేసాడు. అయితే తాను హీరో గా నిలదొక్కుకోవాలని ఆశ పడిన తన తండ్రి మరణం తనని కుంగదీసింది .. అలాగే ఈ సినిమాతో హిట్ కొడతానని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు సుశాంత్. అలాగే నాగ చైతన్య, సమంతల ఎంగేజ్మెంట్ లో తన ఈ సినిమాకి అంకురార్పణ జరిగిందని.... అలాగే సినిమా పూర్తయ్యాక సమంత చి ల సౌ సినిమా చూసిందని.. సినిమా బావుందనిపించి నాగ చైతన్య కి కూడా చూపించిన తర్వాత ఆ సినిమాని తామే విడుదల చేస్తామని సుశాంత్, రాహుల్ రవీంద్రన్ కి చెప్పడం.. అలాగే సినిమా ట్రైలర్ కూడా అందరిని ఆకట్టుకునేలా కట్ చెయ్యడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
ఈ రెండు ఎలా ఉంటాయో..
ఇక ముచ్చటగా టాలీవుడ్ లో మూడో పెళ్లి సినిమా శ్రీనివాస కళ్యాణం. నితిన్ - రాశి ఖన్నా జంటగా.. దిల్ రాజు నిర్మాతగా కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. శ్రీనివాస కళ్యాణం టైటిల్ తోనే సగం పాజిటివ్ బజ్ కొట్టేసిన ఈ సినిమా పబ్లిసిటీ పరంగాను ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతూ క్రేజ్ సంపాదించింది. మరి భారీ అంచనాల నడుమ శ్రీనివాస కళ్యాణం ఆగస్టు 9నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి టాలీవుడ్ మూడు పెళ్లిళ్లలో హ్యాపీ వెడ్డింగ్ సో సో గా ఉండగా.. చి ల సౌ, శ్రీనివాస కళ్యాణం ఏం చేస్తాయో అంటూ ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.