టాలీవుడ్ లో ‘సెకండ్ సినిమా’ సెంటిమెంట్..!

ఇతర ఇండస్ట్రీలలో ఏమోగానీ మన టాలీవుడ్ లో మాత్రం సెంటిమెంట్స్ ఎక్కువ. మొదటి సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు రెండో సినిమాతో హిట్ అందుకోడం కష్టమే అని [more]

Update: 2019-01-28 06:49 GMT

ఇతర ఇండస్ట్రీలలో ఏమోగానీ మన టాలీవుడ్ లో మాత్రం సెంటిమెంట్స్ ఎక్కువ. మొదటి సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు రెండో సినిమాతో హిట్ అందుకోడం కష్టమే అని చాలాసార్లు రుజువైంది. ఎవరో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ తప్ప. రీసెంట్ గా ఇద్దరు డైరెక్టర్స్ కి ఈ సెంటిమెంట్ ఎదురైంది. వారిద్దరు సంక‌ల్ప్‌ రెడ్డి, వెంకీ అట్లూరి. రానాతో ఘాజీ లాంటి నేషనల్ అవార్డు మూవీ తీసిన సంకల్ప్ రెడ్డి రెండో సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడు. మొదటి సినిమాతో అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని, ఇటు రివార్డుల్నీ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు సంకల్ప్. కానీ అతను తీసిన రెండో సినిమా 'అంత‌రిక్షం' డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో తొలి స్పేస్ చిత్రం కాబట్టి అంద‌రి దృష్టి అటు వైపు ప‌డింది. కానీ 'అంత‌రిక్షం' అంచ‌నాల్ని ఏమాత్రం అందుకోలేదు.

ఇద్దరికీ అదే సెంటిమెంట్…

అలానే వరుణ్ తేజ్ తో తొలిప్రేమ లాంటి ఫీల్ గుడ్ స్టోరీని తీసిన వెంకీ అట్లూరి రెండో సినిమాతో ఫెయిల్ అయ్యాడు. అఖిల్ కెరీర్ కు చాలా అవసరం అయిన మిస్టర్ మజ్ను సినిమా గత వారం రిలీజ్ అయింది. రొటీన్ క‌థ‌తో మెప్పిద్దామ‌ని ప్ర‌య‌త్నించి భంగప‌డ్డాడు వెంకీ. దీంతో అతనికి ఈ సెంటిమెంట్ ను ఎదురుకోవడం తప్పలేదు. సినిమా తీస్తున్నప్పుడు ఎన్నో అనుకుంటారు కానీ రిజల్ట్ వచ్చాక వేరేగా ఉంటుంది. కొన్నిసార్లు హిట్ అవుతుంటాయి.. కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. అయితే ఒకటికి రెండు సార్లు కథపై శ్రద్ధ పెడితే సినిమా ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలా కాదని తీస్తే ఇలానే ఉంటుంది.

Tags:    

Similar News