ఈ వారమూ అదే పరిస్థితి..!
జనవరి వచ్చింది మొదలు… సంక్రాంతికి ఒకే ఒక్క సినిమా ప్రేక్షుకులు మెచ్చేదిలా కనబడింది. అది కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఎఫ్ 2. సంక్రాంతికి విడుదలైన సినిమాలలో [more]
జనవరి వచ్చింది మొదలు… సంక్రాంతికి ఒకే ఒక్క సినిమా ప్రేక్షుకులు మెచ్చేదిలా కనబడింది. అది కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఎఫ్ 2. సంక్రాంతికి విడుదలైన సినిమాలలో [more]
జనవరి వచ్చింది మొదలు… సంక్రాంతికి ఒకే ఒక్క సినిమా ప్రేక్షుకులు మెచ్చేదిలా కనబడింది. అది కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఎఫ్ 2. సంక్రాంతికి విడుదలైన సినిమాలలో ఎఫ్ 2 మాత్రమే ఆడగా.. మిగతావన్నీ తుస్సుమన్నాయి. ఇక జనవరి చివరి వారంలో విడుదలైన మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ఫిబ్రవరి అయినా ఆశాజనకంగా కనబడిందా అంటే అదీ లేదు. గత వారం విడుదలైన యాత్ర సినిమా ఒక్కటే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ వారమైనా ప్రేక్షకులు మెచ్చే సినిమాలు ఏమైనా వస్తాయనుకుంటే.. ఈ వారం కూడా తుస్సుమంది. రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి కానీ.. రెండూ ప్రేక్షకులను మేప్పించలేక చేతులెత్తేశాయి. మలయాళం నుండి ప్రియా ప్రకాశ్ నటించిన లవర్స్ డే, తమిళం నుండి దేవ్ విడుదలయ్యాయి.
అమ్మడు క్రేజ్ పనిచేయలేదు…
కన్నుకొట్టి ముద్దుపెట్టి.. గన్ ఎక్కుపెట్టి గుండెల్ని పిండిన ప్రియా ప్రకాశ్ వారియర్ క్రేజ్ తో మలయాళ సినిమాని తెలుగులో లవర్స్ డే సినిమాగా దబ్ చేసి విడుదల చేస్తే… ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. కేవలం హీరోయిన్స్ గ్లామర్, క్రేజ్ తో సినిమాలు ఆడవని లవర్స్ డే నిరూపించింది. లవర్స్ డే సినిమా లో కథ, కథనం, దర్శకత్వం, మ్యూజిక్ ఇలా అన్నీ మైనస్ లే ఉండడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
దేవ్ కూడా ఆకట్టుకోలేక…
ఇక తమిళ దేవ్ సినిమా కూడా చేతులెత్తేసింది. కార్తీ – రకుల్ ప్రీత్ కాంబోలో తెరకెక్కిన దేవ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఖాకీ వంటి హిట్ కాంబో రిపీట్ అవడం, కార్తీ, రకుల్ కి తెలుగులో క్రేజ్ ఉండడంతో దేవ్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ప్రేక్షకుల అంచనాలు దేవ్ అందుకోలేకపోయింది. కొత్త దర్శకుడు దేవ్ ని ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కథ, కథనం, ఎడిటింగ్, మ్యూజిక్ అన్ని సినిమాకి మైనస్ లే. రకుల్ అందాలు కూడా సినిమాని కాపాడలేకపోయాయి. ఇక వీక్ రివ్యూస్ తో దేవ్ కి పూర్తిగా నెగెటివ్ టాక్ పడడంతో.. ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రావడం కష్టంలా కనబడుతుంది. కాబట్టి ప్రేక్షకుడు ఈ వారం కూడా మంచి సినిమాలేవీ లేక ఉసూరుమనక తప్పదు.