ప్రముఖ దర్శకుడు మృతి
మళయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ అశోకన్ మృతి చెందారు.;
మళయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ అశోకన్ మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అస్వస్థతకు గురై కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మళయాల చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. 1980 లో ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆయన అసలు పేరు రామన్ అశోక్ కుమార్. అశోకన్ గా అందరికీ సుపరిచితులు.
కామెడీ డైరెక్టర్ గా...
వర్ణం చిత్రంతో ఆయన దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత అనేక చిత్రాలకు దర్శకత్వం వహించిన అశోకన్ తర్వాత సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఐటీ కంపెనీలు పెట్టారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఎక్కవగా కామెడీ సినిమాలను అశోక్ తీశారు. అశోకన్ మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.