పెళ్లి ఎప్పుడో తెలియదట.. కానీ అక్కడే చేసుకుంటుందట

96 సినిమా కు ముందు త్రిష పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ప్రస్తుతం పెళ్లి ఆలోచనే చేసేలా లేదు త్రిష వ్యవహారం. ఎందుకంటే ప్రస్తుతం [more]

Update: 2020-01-23 07:45 GMT

96 సినిమా కు ముందు త్రిష పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ప్రస్తుతం పెళ్లి ఆలోచనే చేసేలా లేదు త్రిష వ్యవహారం. ఎందుకంటే ప్రస్తుతం త్రిష చేతి నిండా సినిమాలే సినిమాలు. ఏకంగా ఎనిమిది తమిళ సినిమాలు ఒక మలయాళం సినిమా కూడా. అంతేకాకుండా తెలుగులోనూ చిరు సరసన కొరటాల మూవీలో త్రిషనే హీరోయిన్(అధికారికంగా ప్రకటించలేదు) అంత బిజీగా ఉన్న త్రిష పెళ్లి కబుర్లు ఆమె అభిమానుల్లో హాట్ హాట్ గా చర్చనీయాంశం అయ్యింది. అయితే గతంలో వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని పెళ్ళికి బ్రేకప్ కూడా చెప్పిన త్రిష మరోసారి పెళ్లి ముచ్చట్లు చేబుతుంది.

సోషల్ మీడియా చాట్ లో పెళ్లి గురించి అడిగిన అభిమానికి సమాధానంగా త్రిష.. పెళ్లి ఎపుడో చెప్పలేనని.. కానీ తన పెళ్లి మాత్రం లాస్ వేగాస్ లోనే జరుగుతుంది అని చెబుతుంది. నేను పెళ్లి చేసుకుంటే లాస్ వేగాస్ లోనే చేసుకుంటా అంటూ ఆ అభిమానికి చెప్పింది.మరి త్రిష ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఛాన్స్ అయితే లేదు. మరి అన్ని సినిమాలు పూర్తి చెయ్యాలంటే కనీసం మూడేళ్లయినా పడుతుంది. అప్పుడు కానీ త్రిష పెళ్లి ముచ్చట్లు బయటికొస్తాయన్నమాట. మరి ఒకే ఒక్క 96 సినిమా త్రిష లైఫ్ ని టర్న్ చేసిపడేసిందన్నమాట.

Tags:    

Similar News