త్రిష అంత ఇబ్బంది పడిందా?
మెగా స్టార్ తో త్రిష ఇంతకుముందే స్టాలిన్ సినిమాలో నటించింది. అందులో చిరు బొద్దుగా ఉన్నప్పటికీ.. త్రిష గ్లామర్ గా ఆకట్టుకుంది. అయితే తాజాగా త్రిష ఆచార్య [more]
మెగా స్టార్ తో త్రిష ఇంతకుముందే స్టాలిన్ సినిమాలో నటించింది. అందులో చిరు బొద్దుగా ఉన్నప్పటికీ.. త్రిష గ్లామర్ గా ఆకట్టుకుంది. అయితే తాజాగా త్రిష ఆచార్య [more]
మెగా స్టార్ తో త్రిష ఇంతకుముందే స్టాలిన్ సినిమాలో నటించింది. అందులో చిరు బొద్దుగా ఉన్నప్పటికీ.. త్రిష గ్లామర్ గా ఆకట్టుకుంది. అయితే తాజాగా త్రిష ఆచార్య సినిమాలోనూ చిరు తో జోడిగా కనిపించనుందని ప్రచారం జరిగింది. అయితే అసలు త్రిష ఉందో.. లేదో.. అని కన్ఫర్మ్ అవ్వకుండానే త్రిష చిరు సినిమా నుండి బయటకు వచ్చేసింది. అయితే త్రిష, కొరటాల శివ నుండి ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే చిరు సినిమా నుండి తప్పుకుంటున్నా అంది. అయితే త్రిష పాత్ర మరీ పెద్ద అమ్మాయిలా అంటే ఆంటీలా ఉండడం వలన త్రిష తప్పుకుంది అన్నారు. అలాగే త్రిష పాత్రకి పెద్దగా ప్రధాన్యం లేదట.. అందుకే త్రిష చిరు సినిమా నుండి తప్పుకుంది అంటే.. కాదు త్రిష కి సినిమాలో మరో హీరోయిన్ ఉండడం నచ్చలేదు అంటున్నారు.
అదేమిటంటే… ఈ సినిమాలో చిరు తో పాటుగా మరో యంగ్ స్టార్ (మహేష్ ఆర్ రామ్ చరణ్) నటిస్తాడని.. అతడి పాత్రని కొరటాల దాదాపుగా 30 మినిట్స్ పెట్టాడని.. అందుకే ఆ పాత్రకి మరో యంగ్ హీరోయిన్ కూడా తీసుకోబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఒకే హీరోయిన్.. అది త్రిషనే అన్నారు. కానీ తర్వాత మరో హీరోయిన్ అనేసరికి త్రిష కి మండింది. కాదు బాగా ఇబ్బంది పడి.. ఆలా ఇద్దరు హీరోయిన్స్ ఉంటే.. తన స్క్రీన్ స్పేస్ తగ్గిపోతుంది అని.. త్రిష కంగారు పడి ముందే ఆ సినిమా నుండి తప్పుకుందని న్యూస్ ప్రచారం లోకొచ్చింది. లేదంటే సారీస్ తో పద్ధతిగా నటించమంటే ఏ హీరోయిన్ తన పాత్రకి ఒదులుకోదు. ఇక త్రిష చాలా సినిమాల్లో గ్లామర్ గాను ట్రెడిషనల్ గాను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మాత్రం కేవలం తన స్క్రీన్ స్పేస్ తగ్గుతుందనే భయంతోనే త్రిష ఈ సినిమా నుండి తప్పుకుంది లేదంటే. కొరటాల – చిరు లాంటి పేరున్న దర్శక హీరోలతో చేసే సినిమాని ఎలా ఒదులుకుంటుంది అంటున్నారు.