Trivikram Samantha: సమంతను త్రివిక్రమ్ అలా పోల్చడం.. సెట్ అవ్వలేదే!!

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను

Update: 2024-10-09 11:47 GMT

Trivikram Samantha

అలియా భట్ నటించిన జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నటి సమంత హాజరయ్యారు. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ సమంతను ప్రశంసించారు. ఆమె రజనీకాంత్‌తో సమానంగా ప్రజాదరణ పొందిందని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి. త్రివిక్రమ్ సమంతను రజనీకాంత్‌తో పోల్చడంలో లాజిక్ అసలు లేదంటున్నారు.

సమంత మలయాళం, కన్నడ భాషల్లో చాలా పాపులర్ అని త్రివిక్రమ్ చెప్పారు. అయితే సమంత ఇప్పటి వరకు మలయాళం, కన్నడ సినిమాల్లో నటించలేదన్నారు. సమంత అక్కడి వారికి తెలిసి ఉండొచ్చు.. ఆమె నటించిన సినిమాలు డబ్ అయి ఉండొచ్చు. కన్నడలో ఈగ సినిమా ద్వారా బాగా పేరు తెచ్చుకుని ఉండొచ్చు కానీ, అక్కడ ఆమె రజనీకాంత్‌ స్థాయి పాపులారిటీని ఎలా పొందుతుందని ప్రశ్నించారు. ఇక ఆమె హిందీలో ఏ సినిమాలో కూడా చేయలేదని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.

సమంత లో ఉన్న లక్షణాలే అలియాభట్ లో కూడా ఉన్నాయన్నారు త్రివిక్రమ్. సమంత సెట్ లో ఉన్నంత సేపు డైనమెట్ ఉన్నట్టు ఉంటుందనీ, ఆమె చేసే ఏ షాట్ కూడ అసలు బోర్ కొట్టదన్నారు త్రివిక్రమ్. స్త్రీలకు ఎవరో పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్నీ ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు త్రివిక్రమ్. సమంత గారు ముంబైలో జరిగే కార్యక్రమాలకే కాకుండా.. హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు రావాలన్నారు త్రివిక్రమ్. హైదరాబాద్‌లో లేకపోవడం, మీరు చేయరేమోననే భయంతో మేం మీకు కథలు రాయడం లేదన్నారు త్రివిక్రమ్. మీరు నటిస్తానంటే తాము కథలు రాస్తామని త్రివిక్రమ్ చెప్పగానే సమంత రాయండి అంటూ సైగలు చేశారు.

Tags:    

Similar News