ఆ బాధ్యత తివిక్రమ్ కే అప్పగించేశాడట…!

చాలా గ్యాప్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే [more]

Update: 2019-01-25 06:14 GMT

చాలా గ్యాప్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే నెల ఫిబ్ర‌వ‌రి 14 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో ఫైనలైజ్ అవ్వలేదు. చాలా పేర్లు విపిస్తున్నా క్లారిటీ మాత్రం రాలేదు. అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్స్ చాలా కీలకంగా మారుతుంటారు. డీజేలో పూజా హెగ్డే ఎంట్రీ ఇవ్వ‌డానికి, నా పేరు సూర్య సినిమాలో అనూ ఇమ్మానియేల్ రాక‌కీ కారణం బన్నీనే.

త్రివిక్రమ్ మాటే ఫైనల్

అయితే ఈ సినిమాలో హీరోయిన్స్, ఇతర కాస్టింగ్ విషయంలో త్రివిక్రమ్ మాటే ఫైనల్ అంట. కమెడియన్స్ దగ్గర నుండి ఇతర కాస్టింగ్ విషయం వరకు త్రివిక్రమ్ ఆచితూచి ఆలోచిస్తాడు. బన్నీ కూడా త్రివిక్రమ్ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడని టాక్. అయితే హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ కొన్ని పేర్లు ఆల్రెడీ అనుకున్నాడని… బన్నీతో, త్రివిక్రమ్ తో ప‌నిచేయ‌ని క‌థానాయికే ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. మరి ఆమె ఎవరో మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News