Unstoppable 2 : ప్రభాస్ తో ఆడుకున్న చరణ్ - బాలయ్య.. ఆ కోడ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో ?
ఎపిసోడ్ అంతా సరదాగా సాగగా.. బాలకృష్ణ, ప్రభాస్ పెళ్లి అండ్ రేలషన్షిప్ గురించి అడగటం మొదలుపెట్టడంతో.. అసలు మజా వచ్చింది.
బాహుబలి విత్ బాలయ్య.. ఎపిసోడ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూసిన అభిమానుల ఎదురుచూపులకు ఆహా ఎట్టకేలకు తెర దించింది. గురువారం రాత్రి 9 గంటలకు పార్ట్ 1 ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసింది. కానీ.. ఒకేసారి అభిమానుల నుండి ట్రాఫిక్ ఎక్కువగా రావడంతో.. ఆహా సైట్ క్రాష్ అయ్యింది. కొంతసేపు ఆహా పనిచేయకపోవడంతో.. అభిమానులు ఇబ్బందిపడ్డారు. కాసేపటికే ఆ సమస్యను పరిష్కరించి.. ఎపిసోడ్ ను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. ఈ ఎపిసోడ్ లో అభిమానులు ఊహించినట్టే.. బాలయ్య ప్రభాస్ పెళ్లి టాపిక్ తో ఒక ఆట ఆడుకున్నారు. మధ్యలో చరణ్ ఫోన్ కాల్ ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది.
ఎపిసోడ్ అంతా సరదాగా సాగగా.. బాలకృష్ణ, ప్రభాస్ పెళ్లి అండ్ రేలషన్షిప్ గురించి అడగటం మొదలుపెట్టడంతో.. అసలు మజా వచ్చింది. రామ్ చరణ్ కి కాల్ చేసిన బాలయ్య.. 'ప్రభాస్ ప్రస్తుతం ఎవరితో రేలషన్షిప్లో ఉన్నాడో చెప్పు' అని అడిగాడు. అయితే దానికి చరణ్.. "సారీ బాలయ్య గారు మాకు ఒక బ్రో కోడ్ ఉంటుంది. దానిని బ్రేక్ చేయలేను" అన్నాడు. దాంతో బాలయ్య.. "ఈ బ్రో కోడ్లు మన దగ్గర చెల్లవు, ప్రస్తుతం ప్రభాస్ ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. రాజులా, రెడ్డిలా, నాయుళ్ళ, చౌదరిలా, సనన్ లేదా శెట్టినా అనేది నువ్వు చెప్పాల్సిందే" అని బలవంతం చేయడంతో.. ప్రభాస్ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని చెప్పి కాసేపు ఆడుకున్నారు. దీంతో ప్రభాస్.. "ఒరేయ్ చరణ్ నువ్వు అసలు నా ఫ్రెండ్వా? శత్రువా? మన బ్రో కోడ్ ని బ్రేక్ చేసి నన్ను ఆడుకుంటావా నీ పని చెబుతాను ఆగు. సార్ చరణ్ గాడు ఈ షోకి వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి లేదా నన్ను పిలవండి అప్పుడు చెబుతా నేను కూడా" అని అనడం అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తుంది. మొదటి ట్రైలర్లోనూ ఈ డైలాగ్ చూపించారు.
ఇక బాలయ్య.. చరణ్ ను నువ్వెప్పుడొస్తున్నావ్ అని అడగ్గా.. "మాట దూరం సార్, మీరు పిలవండి వచ్చేస్తా" అని చెప్పాడు. దీంతో ఈ సీజన్ లేదా నెక్ట్స్ సీజన్లో రామ్ చరణ్ అన్ స్టాపబుల్ కి వస్తున్నాడని కన్ఫర్మ్ అయింది. బహుశా ఆ ఎపిసోడ్.. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ లతో ప్లాన్ చేస్తారేమో చూడాలి.