హిందీలో వాల్మీకి కి ఇబ్బందులు

హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన వాల్మీకి చిత్రం హిట్ టాక్ తో మంచి వసూళ్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా [more]

Update: 2019-10-04 06:51 GMT

హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన వాల్మీకి చిత్రం హిట్ టాక్ తో మంచి వసూళ్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్ విషయంలో కోటిన్నర రూపాయలు కొనుగోలుదారుల నుంచి ఏదో నిబంధన ఉల్లంఘన నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో మన మేకర్స్ యాభై లక్షలు ఇస్తాం అని చెబుతున్నారు కానీ వాళ్ళు ససేమీరా అంటున్నారు అని తెలుస్తుంది.

హిందీకి బ్రేక్……

ఈ నేపథ్యంలో రానున్న భారీ సినిమాలు సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురంలో సినిమాల హిందీ డబ్బింగ్ అమ్మకాలు నిలిచిపోయాయి. బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు సినిమాలని డైరెక్ట్ గా కొన్ని డబ్ చేయరు. మధ్యవర్తుల దగ్గరే కొంటున్నాయి అక్కడి సంస్థలు. వాళ్లేమో రింగ్ కావడంతో తెలుగు సినిమాల హిందీ అమ్మకాలకు గ్రహణం పట్టేటట్లే కనిపిస్తోంది. అందుకే పెద్ద సినిమాలకి పిడి పడుతుంది. అమ్ముదామన్నా, వారు కొంటామన్నా, కొనుగోలు దారులు పెట్టే కండిషన్లు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి అన్నది టాలీవుడ్ టాక్. అందుకే హిందీ శాటిలైట్ హక్కుల అమ్మకానికి బ్రేక్ పడిపోయింది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.

 

Tags:    

Similar News