సంక్రాంతి బరిలోకి "వాల్తేరు వీరయ్య"
జాలర్ల జీవితం ఆధారంగా సాగే కథ కావడంతో.. ఈ సినిమాలో చిరంజీవి మాస్ లుక్ లో కనిపించనున్నారు. యాస .. డైలాగ్ డెలివరీ ..
మోహన్ రాజా- చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. 153వ సినిమాగా వచ్చిన గాడ్ ఫాదర్.. సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. విజయం దిశగా దూసుకుపోతూ.. రూ.150 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉంది. నెక్ట్స్ చిరంజీవి 154వ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అదే వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా.. విశాఖ నేపథ్యంలో జాలరుల జీవితాలకు సంబంధించిన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది.
జాలర్ల జీవితం ఆధారంగా సాగే కథ కావడంతో.. ఈ సినిమాలో చిరంజీవి మాస్ లుక్ లో కనిపించనున్నారు. యాస .. డైలాగ్ డెలివరీ .. లుక్ డిఫరెంట్ గా ఉండనున్నాయి. ఈ మధ్య వాల్తేరు వీరయ్య గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుందనుకున్నారు అంతా. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్టుగా మేకర్స్ అప్ డేట్ వదిలారు. సినిమా పూర్తయ్యాకే డబ్బింగ్ సెషన్ మొదలవుతుంది కాబట్టి.. వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా.. రవితేజ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. శృతిహాసన్, కేథరిన్ థెరిసాలు నటిస్తున్నారు.