అనుకున్న కలెక్షన్స్ రావేమో?

పవన్ కళ్యాణ్ ఫాన్స్, వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాతో రికార్డులు కొల్లగొట్టాలి, కలెక్షన్స్ పరంగా రికార్డులు నెలకొల్పాలి. ఫస్ట్ వీకెండ్ లోనే [more]

Update: 2021-04-05 04:11 GMT

పవన్ కళ్యాణ్ ఫాన్స్, వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాతో రికార్డులు కొల్లగొట్టాలి, కలెక్షన్స్ పరంగా రికార్డులు నెలకొల్పాలి. ఫస్ట్ వీకెండ్ లోనే వకీల్ సాబ్ బ్రేక్ ఈవెన్ చేరాలి అంటూ కలలు కంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇంకా కర్ణాటక, తమిళనాడు, ఇలా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో దొరికిన స్క్రీన్ దొరికినట్టుగా వకీల్ సాబ్ బొమ్మ పడేలా దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ లు ప్లాన్ చేసుకుంటున్నారు. బెన్ఫిట్ షోస్ కి టికెట్ ధర పెంచేసి కోట్లు కొట్టేయాలని చూస్తున్నారు. కానీ.. అదేమీ వర్కౌట్ అయ్యేలా లేదు.
కానీ కరోనా వీళ్ళ ప్లాన్స్ ఏమి సాగనిచ్చేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి, మార్చ్ 100 పర్సెంట్ అక్యుపెన్సీతో రన్ అయిన థియేటర్లు.. మళ్ళీ కరోనా మహమ్మారి కాటేసేలా కనిపిస్తుంది. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూస్, మరి కొన్ని చోట్ల లాక్ డౌన్. మహారాష్ట్ర సర్కార్ అయితే ఏకంగా లాక్ డౌన్ పెట్టేందుకు వెనకాడబోము అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే థియేటర్స్ బంద్ గ్యారెంటీ. ఏప్రిల్ 9 న రిలీజ్ అవుతున్న వకీల్ సాబ్ వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసి వసూళ్ళ మోత మొగిద్దామనుకుంటుంటే.. కరోనా కాటుకి బలయ్యేలా ఉంది పరిస్థితి.  
ఆంధ్ర, తెలంగాణల్లో కరోనా వలన లాక్ డౌన్ పెట్టమని చెబుతున్నా కేసుల తీవ్రత పెరిగితే ప్రేక్షకులే ఆలోచిస్తారు. ఫాన్స్ కి ఎటూ తప్పదు కానీ ప్రేక్షకులు రిస్క్ చెయ్యలేరు. ఇక వకీల్ సాబ్ సినిమాకి ఫాన్స్, ప్రేక్షకుల ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటే.. కరోనా విపరీతంగా విస్తరించే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ ఆ దిశగా ఆలోచిస్తే.. కష్టం. మరి వకీల్ సాబ్ ఎంతో ఉత్సాహంగా ప్రమోషన్స్ చేసుకుంటూ థియేటర్స్ లోకి వస్తుంటే.. ఈ అడ్డంకులు ఏమిటో అంటూ ఫాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

Tags:    

Similar News