పవన్ మ్యానియా: నిర్మాతల అదృష్టం!
ఏప్రిల్ 9 న సోలో గా బరిలోకి దిగుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కి జడిసి ఏ హీరో ఏప్రిల్ 9 న తమ [more]
;
ఏప్రిల్ 9 న సోలో గా బరిలోకి దిగుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కి జడిసి ఏ హీరో ఏప్రిల్ 9 న తమ [more]
ఏప్రిల్ 9 న సోలో గా బరిలోకి దిగుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కి జడిసి ఏ హీరో ఏప్రిల్ 9 న తమ సినిమా రిలీజ్ కి డేట్ ఇవ్వలేదు. వారానికి డజను, అరడజను, మూడు నాలుగు సినిమాలు విడుదలవుతున్న టైం లో వకీల్ సాబ్ కి సోలో గా దారిచ్చారు. దానితో నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ ని క్యాష్ చేసుకోవడానికి ఫుల్ గా రెడీ అయ్యాడు. అందుకే ఒకటి అరా థియేటర్ వదిలేసి.. వకీల్ సాబ్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ అన్నిటిలో సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మల్టిప్లెక్స్ లో ఒకటి రెండు థియేటర్స్ వదిలేసినా మిగతా అన్ని థియేటర్స్ లో వకీల్ సాబ్ బొమ్మ పడాల్సిందే.
ఫాన్స్ కూడా వకీల్ సాబ్ మ్యానియాతో ఊగిపోతున్నారు. ఇక కేవలం ఇక్కడ మాత్రమే కాదు.. వకీల్ సాబ్ హడావిడి విదేశాల్లో కూడా మొదలు కాబోతుంది. ఓవర్సీస్ లోనూ 700 థియేటర్స్ లో వకీల్ సాబ్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా నిర్మాత బోని కపూర్ తెలిపారు. లాక్ డౌన్ తర్వాత పెద్ద మొత్తంగా థియేటర్స్ లో ఓ ఇండియన్ సినిమా రిలీజ్ కావడం ఇదే మొదటిసారి అని బోని తెలిపారు. మరి వకీల్ సాబ్ ఓవర్సీస్ ప్రీమియర్స్ ఏప్రిల్ 8 నే ప్రదర్శించబోతున్నారు. ఇక్కడ కూడా దిల్ రాజు వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ వారం విడుదలవుతున్న వైల్డ్ డాగ్, సుల్తాన్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా వారానికే దుకాణం బంద్ చెయ్యాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏప్రిల్ 9 న అన్ని థియేటర్స్ లో వకీల్ సాబ్ రిలీజ్ ఉండబోతుంది.
కేవలం మూడు రోజుల బుకింగ్స్ లోనే వకీల్ సాబ్ పెట్టుబడి వెనక్కి తెచ్చే ప్లాన్స్ దిల్ రాజు సిద్ధం చేస్తున్నాడు. సినిమా బావున్నా, బాగోకపోయినా పవర్ స్టార్ మ్యానియాతో సినిమాకి లాభాలు రావడం మాత్రం పక్కాగా కనిపిస్తుంది. అందుకే అనేది వకీల్ సాబ్ నిర్మాతల పాలిట కల్ప వృక్షం అనేది.