వరుణ్ త్యాగానికి విలువ లేకుండా పోయిందా
హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ వాల్మీకి సెప్టెంబర్ 13 నే రిలీజ్ కావాలి . కానీ అదే రోజు [more]
హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ వాల్మీకి సెప్టెంబర్ 13 నే రిలీజ్ కావాలి . కానీ అదే రోజు [more]
హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ వాల్మీకి సెప్టెంబర్ 13 నే రిలీజ్ కావాలి . కానీ అదే రోజు నాని గ్యాంగ్ లీడర్ ఉండడంతో వాల్మీకి ప్రొడ్యూసర్స్ వెనక్కి తగ్గారు. దాంతో ఈమూవీ సెప్టెంబర్ 20 న రిలీజ్ అవుతుంది. సరే 20 న సేఫ్ గా ఉండొచ్చు అనుకుంటే అదే రోజు సూర్య నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'బందోబస్త్' విడుదలవుతోంది. సో వరుణ్ కి సూర్య తో తప్పడంలేదు.
అలా జరిగితే…. ఇలా అయ్యింది
అసలే 'బందోబస్త్' చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. వాల్మీకి కి ఏమాత్రం తేడా టాక్ వచ్చినా కలెక్షన్స్ పై పడుతుందని 'వాల్మీకి' టీమ్ ని భయపెడుతోందట. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ కి 'బందోబస్త్' రూపం లో సూర్య విలన్ గా మారడం విడ్డూరమే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నానితో ఎందుకులే అని పక్కకు తప్పుకుంటే ఇప్పుడు సూర్య వచ్చాడు. కాకపోతే ఇక్కడ వరుణ్ తేజ్ కి కలిసొచ్చే అంశం ఏంటంటే సూర్య 'బందోబస్త్'కి అసలు క్రేజ్ లేదు. ఏమాత్రం నెగటివ్ టాక్ వచ్చినా వాల్మీకి సేఫ్ అయిన్నట్టే.