వాల్మీకి ఇక కనపడదు

హీరో వరుణ్ నటిస్తున్న వాల్మీకి సినిమా టైటిల్ వివాదానికి తెరపడింది. ఈ సినిమా పేరు ను మారుస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టుకు [more]

Update: 2019-09-20 02:49 GMT

హీరో వరుణ్ నటిస్తున్న వాల్మీకి సినిమా టైటిల్ వివాదానికి తెరపడింది. ఈ సినిమా పేరు ను మారుస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టుకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చింది. గత కొన్ని రోజులుగా సినిమా టైటిల్ పైన వాల్మీకి సమాజం పొరాటం చేస్తుంది. దీంతో పాటుగా సినిమా టైటిల్ తమను కించే పరిచే విధంగా వుందని, దీనిని మార్చే విధంగా చిత్ర యూనిట్ కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలను కూడా కోర్టు వినింది. వాల్మీకి టైటిల్ ను మార్చాలని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టు లో పిటీషన్ వెసింది. పిటీషన్ పై చిత్ర యూనిట్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. హైకోర్టు నొటీసుల పై వివరణ ఇచ్చిన చిత్ర యూనిట్…. వాల్మీకి టైటిల్ ను మారుస్తున్నామని హైకోర్టుకు తెలిపింది. కొత్త టైటిల్ “గద్దలకొండ గణేష్” అని పెట్టామని కూడా పేర్కొంది.

Tags:    

Similar News