మొత్తానికి వర్మ అనుకున్నది సాధించాడు..!

రామ్ గోపాల్ వర్మ అంటే పట్టు వదలని విక్రమార్కుడు అనే పేరుంది. తాను ఏం చెయ్యాలనుకుంటున్నాడో.. ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అన్నీ కచ్చితంగా చేసేస్తాడు. అలాంటిది తన [more]

Update: 2019-03-19 08:16 GMT

రామ్ గోపాల్ వర్మ అంటే పట్టు వదలని విక్రమార్కుడు అనే పేరుంది. తాను ఏం చెయ్యాలనుకుంటున్నాడో.. ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అన్నీ కచ్చితంగా చేసేస్తాడు. అలాంటిది తన సినిమాని ఎవరైనా విడుదల కాకుండా అడ్డుపడడానికి ట్రై చేస్తే ఊరుకుంటాడా.. అస్సలు ఊరుకోడు. అందుకే తన సినిమాని విడుదల కాకుండా ఆపితే యూట్యూబ్ లో అయినా విడుదల చేస్తామని ఎప్పుడో హెచ్చరించాడు. వర్మ తాజా చిత్రం లక్షీస్ ఎన్టీఆర్ విషయంలో రోజుకో నాటకానికి వర్మ తెర తీస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా అందరి ఫోకస్ తన మీదే ఉండేలా ప్లాన్ చేస్తున్న వర్మకి కొన్నిసార్లు అది వర్కౌట్ అయినా కొన్నిసార్లు మాత్రం తేడా కొడుతోంది. ఒకపక్క మీడియా మొతం ఏపీ ఎన్నికల చుట్టూ తిరుగుతూ తనని ఎక్కడ నెగ్లెట్ చేస్తుందో అని.. మీడియా ఫోకస్ తన మీదకి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు వర్మ. అందుకే సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా సెన్సార్ వారు తనకి అడ్డం పడుతున్నట్లుగా ప్రచారం చేసాడు.

సినిమాకు సెన్సార్ క్లియరెన్స్

సెన్సార్ వారు తన లక్షీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ చెయ్యడం లేదంటూ మీడియాకి ఎక్కుతున్నట్లుగా ఓవరేక్షన్ చేసిన వర్మ.. తర్వాత సెన్సార్ వారితో తనకు విభేదాలు సద్దుమణిగేయాని చెప్పాడు. అయితే ఈ శుక్రవారం విడుదలవుతుందనుకున్న లక్షీస్ ఎన్టీఆర్ సినిమాను మాత్రం 29కి వాయిదా వేశారు. సెన్సార్ కారణాలతో సినిమా విడుదల ఏపీ ఎలక్షన్స్ అయ్యే వరకు ఆగుతుంది అనుకుంటే పట్టు వదలని వర్మ సెన్సార్ బోర్డుతో చర్చలు జరిపి ఇందులో వివాదాంశాలు ఏవీ లేవని నచ్చజెప్పి విడుదలకు మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. కాకపోతే ప్రమోషన్స్ కి కొన్ని కారణాలతో సినిమాని మార్చ్ 22 నుండి 29కి మార్చాడు.

Tags:    

Similar News