వాల్మీకి లుక్ అదిరిందిగా
వినాయక చవితి సందర్భంగా వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న వాల్మీకి చిత్రం నుండి ఒక పోస్టర్ వచ్చింది. ఇందులో వరుణ్ తేజ్ [more]
వినాయక చవితి సందర్భంగా వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న వాల్మీకి చిత్రం నుండి ఒక పోస్టర్ వచ్చింది. ఇందులో వరుణ్ తేజ్ [more]
వినాయక చవితి సందర్భంగా వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న వాల్మీకి చిత్రం నుండి ఒక పోస్టర్ వచ్చింది. ఇందులో వరుణ్ తేజ్ లుక్ 90లనాటి లవర్ బాయ్ గెటప్ లో ఆసక్తికరంగా ఉంది. నల్ల బట్టలు, మెడలో దండలు, జులపాలుతో ఉరమాస్ గ్యాంగ్ స్టర్ లుక్ లో దర్శనమిచ్చిన వరుణ్ ఈ కొత్త లుక్ ఆసక్తిని రేపుతోంది.
ఇది ఫస్ట్ వచ్చిన లుక్ కి చాల డిఫరెంట్ గా ఉంది. అలానే ఈ పోస్టర్ లో పూజ లుక్ కూడా చాలా బాగుంది. ఇందులో ఆమె లంగా ఓణీ, రెండు జడలతో ఆకాలపు అమ్మాయి లుక్ లో కనిపించడంతో వీరిద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని పోస్టర్ చూస్తే అర్ధం అయిపోతుంది. ఇది ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ అని అర్ధం అవుతుంది.
సెప్టెంబర్ 20 న రిలీజ్ అవుతున్న ఈసినిమాను 14రీల్స్ వారు నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం చిత్రం కి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.