పల్లెటూరి లుక్ లో ఇరగదీసింది

బికినీలలో, మోడరన్ డ్రెస్సులతో మత్తెక్కించే పూజ హెగ్డే… బాలీవుడ్ లో జరుగుతున్న అతి పెద్ద ఫ్యాషన్ షో లక్మే ఫ్యాషన్ వీక్ లో అదిరిపోయే డిజైనర్ వెర్స్ [more]

Update: 2019-08-26 07:30 GMT

బికినీలలో, మోడరన్ డ్రెస్సులతో మత్తెక్కించే పూజ హెగ్డే… బాలీవుడ్ లో జరుగుతున్న అతి పెద్ద ఫ్యాషన్ షో లక్మే ఫ్యాషన్ వీక్ లో అదిరిపోయే డిజైనర్ వెర్స్ తో అదరగొట్టే రాంప్ వాక్ చేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తుంది. మోడరన్ కి కేరాఫ్ గా నిలిచే పూజ హెగ్డే.. టాలీవుడ్ లో నటించని స్టార్ హీరో లేరంటే నమ్మాలి. రామ్ చరణ్ పక్కన కొద్దిలో మిస్ అయిన పూజ హెగ్డే, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లను చుట్టేసింది. తాజాగా యావరేజ్ హీరోలతోనూ అంటే వరుణ్ తేజ్, కొత్తగా లిస్ట్ లోకొచ్చిన అఖిల్ సినిమాల్తోనూ పూజ హెగ్డే డైరీ ఫుల్ అయ్యింది.

ఇక మోడరన్ డ్రెస్సులతో మత్తెక్కించే పూజ హెగ్డే లంగావోణీ తో సైకిల్ తొక్కుతూ ఓ మాస్ అండ్ పల్లెటూరి లుక్ లో అదరగొట్టేస్తుంది. హరీష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలో పూజ హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా టీజర్ వదిలినప్పుడు పూజ హెగ్డే లుక్ ని దాచేసిన హరీష్.. ఇప్పుడు స్పెషల్ గా వదిలాడు. ఆ లుక్ లో పదహరణాల అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిలా పూజ హెగ్డే ఇరగదీసేసింది. లంగావోణీ వేసుకుని రెండు జడలతో సైకిల్ తొక్కుతూ వస్తున్న పూజ హెగ్డే వాల్మీకి లుక్ అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది. మరి మోడరన్ పూజ ని అంటే బికినీ లో పూజ ని చూసిన ప్రేక్షకులకు ఇప్పుడు పూజ హెగ్డే పల్లెటూరి లుక్ చూస్తే మాత్రం షాకవ్వడం ఖాయం.

Tags:    

Similar News