టోటల్ కన్ఫ్యూషన్ లో వెంకిమామ?
ఏ సినిమా అయినా క్రేజ్ తోనో, లేదంటే ప్రమోషన్స్ తోనో హైలెట్ అవుతూ ఉంటుంది. కానీ వెంకటేష్, నాగ చైతన్య ల కాంబోలో బాబీ తెరకెక్కిస్తున్న వెంకిమామ [more]
;
ఏ సినిమా అయినా క్రేజ్ తోనో, లేదంటే ప్రమోషన్స్ తోనో హైలెట్ అవుతూ ఉంటుంది. కానీ వెంకటేష్, నాగ చైతన్య ల కాంబోలో బాబీ తెరకెక్కిస్తున్న వెంకిమామ [more]
ఏ సినిమా అయినా క్రేజ్ తోనో, లేదంటే ప్రమోషన్స్ తోనో హైలెట్ అవుతూ ఉంటుంది. కానీ వెంకటేష్, నాగ చైతన్య ల కాంబోలో బాబీ తెరకెక్కిస్తున్న వెంకిమామ మాత్రం అభిమానులనే కాదు.. టోటల్ ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. ఆ సినిమా విడుదల డేట్ సంగతలా ఉంచితే… ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైందని, హీరోలిద్దరూ ఈ సినిమా కోసం పారితోషకం త్యాగం చేసారని, కొన్ని సీన్స్ ని సురేష్ బాబు రీ షూట్స్ చేయించాడని, అలాగే డైటింగ్ లోను ఫిల్టర్ మీద ఫిల్టర్ వేస్తున్నారని ఇలా రకరకాల న్యూస్ వినిపించడం జరిగింది. ఇక చైతూ బర్త్ డే రోజున కెప్టెన్ కార్తీక్ లుక్ గా చైతు లుక్ ఆకట్టుకున్నప్పటికీ…వెంకిమామ కి రిలీజ్ డేట్ ఇవ్వడంలో మేకర్స్ ఎప్పటికప్పుడు నాన్చుతూనే ఉన్నారు.
డిసెంబర్ 13 న వెంకిమామ విడుదల అన్నప్పటికీ… మళ్ళీ సంక్రాంతికి అన్నారు. కానీ డిసెంబర్ 25 క్రిష్ట్మస్ కి అంటున్నారు. అయితే క్రిష్ట్మస్ కి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ని తెలుగులో విడుదల చెయ్యడంతో… వెంకిమామ విషయంలో సురేష్ బాబు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాడట. మరి రూలర్ తర్వాత ప్రతి రోజు పండగే, దబాంగ్ 3 ఉండగా.. ఆ తర్వాతి వారం లో వెంకిమామ ని విడుదల చేసే ఏర్పాట్లను మేకర్స్ మొదలెట్టినట్టుగా ఫిలింనగర్ టాక్. ఇక డిసెంబర్ 25 న విడుదల కావాల్సిన భీష్మ కూడా వాయిదా పడడంతో… వెంకిమామ కి రూట్ క్లియర్ అయినట్లుగా టాక్. ఏది ఏమైనా క్రేజ్ ఉన్న వెంకటేష్, చైతు వెంకిమామ విషయంలో మాత్రం నిర్మాత సురేష్ బాబు మరీ కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది.