వెన్నెల కిషోర్ కి ఏమైంది..?

గత కొన్నాళ్లుగా వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకులను రంజింప చెయ్యడం లేదు. గతంలో ఆనందో బ్రహ్మ, అమీ తుమీ సినిమాల్లో వెన్నెల కిషోర్ కామెడీకి ప్రేక్షకులు బాగా [more]

Update: 2019-01-15 05:37 GMT

గత కొన్నాళ్లుగా వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకులను రంజింప చెయ్యడం లేదు. గతంలో ఆనందో బ్రహ్మ, అమీ తుమీ సినిమాల్లో వెన్నెల కిషోర్ కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక వెన్నెల కూడా పలు సినిమాల్లో బుక్ అయ్యాడు. అంటే ఖాళీ లేనంత గా వెన్నెల కిషోర్ డైరీ ఫుల్ అయ్యింది. అప్పటినుండి ఏ సినిమాలో చూసినా వెన్నెల కిశోరే కనబడుతున్నాడు. ఇండస్ట్రీలో సునీల్, బ్రహ్మానందం హావా బాగా తగ్గడంతో వెన్నెల కిషోర్ కెరీర్ ఒక రేంజ్ లో మారిపోతుందని అనుకున్నారు. ఇక హీరోలు కూడా వెన్నెల కిషోర్ డేట్స్ కోసం వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చేసింది.

ఎఫ్ 2లోనూ తేలిపోయాడు

అప్పట్లో అంటే గత ఏడాది నాగ చైతన్య – మారుతీ కాంబోలో తెరకెక్కిన్న శైలజారెడ్డి అల్లుడు కేవలం వెన్నెల కోసం కొన్నాళ్ళు షూటింగ్ ఆపిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమాలో వెన్నెల కిషోర్ కూరలో కరేపాకు మాదిరి నాగ చైతన్య కు భజన చేసే పాత్రలో తేలిపోయాడు. ఇక గీత గోవిందంలో సినిమా చివర్లో కాసేపు వెన్నెల కామెడీ పండింది. కానీ తర్వాత వెన్నెల కిషోర్ చేసిన సినిమాలన్నీ వరసగా ప్లాప్స్ అయ్యాయి. అమర్ అక్బర్ ఆంటోని ఇంకా చాలా సినిమాల్లో వెన్నెల కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఇక తాజాగా ఎఫ్ 2లోనూ వెన్నెల కామెడీ ప్రేక్షకులకు నీరసాన్ని తెప్పించింది.
ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో వెన్నెల కిషోర్ ఎపిసోడ్ చాలా వీక్ గా అనిల్ రావిపూడి డిజైన్ చేసాడు.

నూత‌న్ దీ అదే ప‌రిస్థితి…

అనిల్ అసలు వెన్నెల కిషోర్ కామెడీని వాడుకోలేకపోయాడంటున్నారు ప్రేక్షకులు. డైలాగ్స్ లో, వెన్నెల నటించిన సీన్స్ లో అసలు బలం లేకపోవడంతో వెన్నెల కిషోర్ ఎపిసోడ్ మొత్తం నీరసాన్ని తెప్పించిందని… తన పాత్రలో కామెడీ లేకపోవడంతో వెన్నల కిషోర్ తేలిపోయాడని అంటున్నారు. ఇక వెన్నెలకు అసిస్టెంట్ పాత్రలో నటించిన బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు.. క్యారెక్టర్ అయితే.. అసలెందుకు పెట్టారో అర్ధం కానీ పరిస్థితి. మరి ఎఫ్ 2 సినిమాలో వెన్నెల కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. దానితో వెన్నెల అవకాశాలకు గండి పడుతుందేమో అంటున్నారు విశ్లేషకులు.

 

Tags:    

Similar News