బసవతారకం అనగానే విద్యనే గుర్తొస్తుంది
నందమూరి తారక రామారావు అంటే తెలియని వారుండరు. పెద్దల దగ్గరనుండి చిన్న పిలల్ల వరకు ఎన్టీఆర్ అందరికి పరిచయం అక్కర్లేని వ్యక్తి. మరి ఆయన నట జీవితమే [more]
నందమూరి తారక రామారావు అంటే తెలియని వారుండరు. పెద్దల దగ్గరనుండి చిన్న పిలల్ల వరకు ఎన్టీఆర్ అందరికి పరిచయం అక్కర్లేని వ్యక్తి. మరి ఆయన నట జీవితమే [more]
నందమూరి తారక రామారావు అంటే తెలియని వారుండరు. పెద్దల దగ్గరనుండి చిన్న పిలల్ల వరకు ఎన్టీఆర్ అందరికి పరిచయం అక్కర్లేని వ్యక్తి. మరి ఆయన నట జీవితమే కానివ్వండి, రాజకీయ జీవితం కానివ్వండి అది అందరికి తెరిచిన పుస్తకమే. ఎవరో చెప్పినట్టు.. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంథ్యమేల…? అన్నట్టు …ఎన్టీఆర్ గురించి కొత్తగా చూపించడానికి ఏం లేదు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎక్కడ ఫోకస్ అవ్వలేదు. ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మని ఫొటోస్ లో చూడడం తప్ప బసవతారకం గారు మీడియా ముందుకొచ్చింది లేదు. అసలు ఎన్టీఆర్ భార్య తో పిల్లల్తో ఎలా ఉండేవారో అనేది కూడా ఎవరికీ తెలియని ప్రశ్నే.
అందుకే బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ లో కథానాయకుడిగా అందరికి తెలిసిన కథతో సినిమా చేస్తే ఏం బావుంటుందని.. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రజలకు చూపించాడు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రని బాలీవుడ్ నటి విద్య బాలన్ తో చేయించాలనుకోవడమే సినిమా హిట్ కి సగం కారణంగా చెప్పొచ్చు. బసవ తారకంగా విద్యా బాలన్ ను ఎంచుకోవడం మంచి కాదు కాదు బెస్ట్ ఛాయిస్ అని అడుగడునా ఆమె రుజువు చేసింది. ఆ పాత్రకు విద్య బాలన్ వలన హుందాతనం వచ్చింది. డబ్బింగ్ ఎవరు చెప్పారో గానీ… సూపర్ గా సెట్ అయ్యింది.
బసవతారకంగా విద్య బాలన్ నటించలేదు.. జీవించింది. బావ అంటూఎన్టీఆర్ ని పిలవడం కానీ.. ఎన్టీఆర్ కి తోడు నీడగా ఉండడం, ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ మరణం అప్పుడు ఆమె ఇచ్చిన ఎక్సప్రెషన్స్ అద్భుతః. అసలు కథానాయకుడి లో విద్య బాలన్ ని బసవతారకం పాత్రలో చూసిన చాలామందికి ఎన్టీఆర్ భార్య జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా విద్య బాలన్ గుర్తుకు రావడం ఖాయం. అంత చక్కగా బసవతారకం కేరెక్టర్ ని విద్య పోషించింది. మరి ఆమె అధిక పారితోషకం డిమాండ్ చేసిందని.. ఆమె పాత్రే సినిమాలో హైలెట్ అవ్వాలనే కండిషన్స్ పెట్టినట్లుగా గతంలో వార్తలొచ్చాయి. మరి ఈ సినిమాకి ఎన్టీఆర్ బయోపిక్ అనేకన్నా ఎక్కువగా బసవతారకం బయోపిక్ అనొచ్చు అనే మాట చాలామంది నోటా వినబడుతుంది.. అంటే అది విద్య గొప్పదనమే. మరి అలాంటి విద్యకి పారితోషకం ఎంత ఇచ్చిన తక్కువేనేమో.