పవర్ ఫుల్ గెటప్ లో విజయ్ దేవరకొండ..!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కొత్త డైరెక్టర్ భరత్ కమ్మ డైరెక్షన్ లో డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ప్రీ [more]

Update: 2019-01-29 07:21 GMT

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కొత్త డైరెక్టర్ భరత్ కమ్మ డైరెక్షన్ లో డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనుంది. ఈ మూవీ ఇంకా రిలీజ్ అవ్వకముందే మరో సినిమాను సెట్స్ మీద ఉంచాడు. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ఇదిలా ఉంటే రీసెంట్ గా విజయ్ కు సంబంధించి కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కార్మిక నాయకుడిగా…

అందులో విజయ్ ఖాకీ డ్రెస్ వేసుకుని మీసాలు పెంచి గెడ్డం షేవ్ చేసుకొని ఉన్న గెట్ అప్ హల్ చల్ చేస్తుంది. ఈ స్టిల్ ఏ సినిమాలోది అని చర్చలు మొదలయ్యాయి. ఖాకీ గెటప్ లో ఉన్నాడు కాబట్టి ఇది డియర్ కామ్రేడ్ మూవీకి సంబంధించిన స్టిల్ అని అనుకున్నారు అంతా. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ లుక్ క్రాంతి మాధవ్ సినిమాకు సంబంధించిందంట. ఇందులో విజయ్ సింగరేణి బొగ్గు గనుల్లో పని చేసే వారికి నాయకుడిగా కనిపించనున్నాడు. షూటింగ్ స్టార్ట్ చేసి ఇంకా వారం రోజులు కూడా కాక ముందే స్పెక్యులేషన్స్ మాత్రం మొదలయ్యాయి.

Tags:    

Similar News