ఓవర్ గా ఇన్వాల్వ్ అవుతున్నాడా..?

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా హిట్స్ తో విజయ్ దేవరకొండ రేంజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అటు హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. ఇటు బిజినెస్ [more]

Update: 2019-04-10 06:26 GMT

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా హిట్స్ తో విజయ్ దేవరకొండ రేంజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అటు హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. ఇటు బిజినెస్ లోనూ దూసుకుపోతున్నాడు. సినిమాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. గీత గోవిందం, టాక్సీవాలా మధ్యలో నోటా సినిమా దెబ్బకి విజయ్ కి అతి జాగ్రత్త ఎక్కువైందని న్యూస్ ఎప్పటినుండో వినబడుతూనే ఉంది. ఇక విజయ్ దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్ లోనూ విజయ్ చేతులు పెట్టాడనే న్యూస్ ఉంది. అయితే విజయ్ స్టార్ డం దృష్టిలో ఉంచుకుని.. మైత్రి మూవీస్ వారు, దర్శకుడు సర్దుకుపోతున్నారనే ప్రచారం జరిగింది.

అన్నింటా జోక్యం చేసుకుంటున్న విజయ్

అయితే నిజంగానే డియర్ కామ్రేడ్ విషయంలో విజయ్ దేవరకొండ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది. పర్ఫెక్ట్ ప్రమోషన్స్ కి, అలాగే సినిమా మేకింగ్ లోని పెరిఫెక్షన్స్ కి విజయ్ అతిగా జోక్యం చేసుకుంటున్నాడట. ఇక సినిమా మీద క్రేజ్ ఎలా పెంచాలో తనకి తెలుసనీ.. నిర్మాతలకు, దర్శకుడికి విజయ్ చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నాడట. మొన్నటికి మొన్న టీజర్ కటింగ్ లో విజయ్ ఇన్వాల్మెంట్ గురించి వార్తలొచ్చాయి. ముందు చిత్ర బృందం అనుకున్న టీజర్ ని కాకుండా విజయ్ చెప్పింది కట్ చేసి వదిలితే డియర్ కామ్రేడ్ టీజర్ కి ఎలాంటి స్పందన వచ్చిందో చూసాం.

ప్రమోషన్స్ కూడా విజయ్ చెప్పినట్లే

ఇక విజయ్ దేవరకొండ చెప్పినట్లుగానే డియర్ కామ్రేడ్ సింగిల్స్ ని చిత్ర బృందం వదులుతుందట. మరి విజయ్ ఎలా చెబితే అలానే అన్నట్టుగా ఉందట అక్కడి వ్యవహారం. ఇక నోటాలాగే డియర్ కామ్రేడ్ విషయంలో ఎక్కడా తేడా రాకూడదనే విజయ్ ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అలాగే సినిమాకి ప్రమేషన్స్ బాగుంటే ఆటొమాటిక్ గా సినిమాకి హైప్ పెరుగుతుందని.. అందుకే తనదైన స్టయిల్లో డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ చేస్తున్న విజయ్ సోషల్ మీడియా ద్వారా అందరికీ సినిమా మీద ఆసక్తి కలిగేలా చేస్తున్నాడట. మరి హిట్ హీరో ఎలా చెబితే దర్శకనిర్మాతలు అలాగే వినాలి.

Tags:    

Similar News